|
Abhiram: Hi Aparna, these mangoes are from my friend's garden. They are really tasty. I have brought them for you. (హాయ్. అపర్ణా!ఈ మామిడి పళ్లు మా స్నేహితుడితోటలోవి. చాలా రుచిగాఉన్నాయి. నీ కోసం తెచ్చా.)
| |
Aparna: Really! Thank you. Their smell itself is sweet. Are they for me really? (నిజంగా! వాటి వాసనే తియ్యగా ఉంది. నిజంగా అవి నాకోసమేనా?) Abhiram: Where is dad? I want him to enjoy them too. (నాన్నగారు ఎక్కడ? ఆయన కూడా వాటిని తినాలని నా కోరిక.) Aparna: How sweet, this mango is! Dad is having a bath. He will come and eat them. Don't worry. (ఈ పండెంత తియ్యగా ఉందో! నాన్నగారు స్నానం చేస్తున్నారు. వచ్చితింటారులే. బాధపడకు.) Abhiram: Here he is. Dad, something sweet for you. Here are very sweet mangoes. Have a bite. (అదిగో వచ్చారు. నాన్నా, మీకో తియ్యటి విషయం. ఇక్కడ చాలాతియ్యని మామిడి పండ్లున్నాయి. రుచి చూడండి.) Aparna: They are excellent. How I wish I could eat the whole lot! (చాలా బాగున్నాయి. మొత్తం తినేయాలని కోరికగా ఉంది.) |
చూశారు కదా, Spoken English కు sample ? Spoken English అంటే మనం దైనందిన (Daily) జీవితంలో మాట్లాడే/సంభాషించే English. ఇది రెండు రకాలుగా ఉండొచ్చు. i) Formal English - మనకు పరిచయం లేని వాళ్లతో, మనకంటేపెద్దవాళ్లతో, పై అధికారులతో, ప్రసంగాలు (Speeches) చేసేటప్పుడుమాట్లాడే English. ii) Informal English - మనకు బాగా పరిచయం ఉన్న వాళ్లతో,మన ఇంట్లో వాళ్లతో, మన స్నేహితులతో మాట్లాడే English. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. Spoken English బాగామాట్లాడగలగడం అంటే formal and informal సందర్భాల్లోమాట్లాడగలగడం.
అయితే మనం ఇప్పుడు Informal సందర్భాల్లో English ఎలా మాట్లాడాలో మొదట తెలుసుకుందాం. మన informal తెలుగు ఎలా ఉంటుంది? చాలా వ్యావహారికంగా ఉంటుంది కదా?
| |
చాలా సరళంగా (simple), సూటిగా (direct), తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని తెలియచేయగలగడం. Informal Spoken English కూడా అంతే. చాలా simple గా, direct గా, short and clipped sentences తో సహజంగా (పుస్తకాల నుంచి నేర్చుకుని మాట్లాడుతున్నట్లు కాకుండా) ఉండాలి. అప్పుడు మన Spoken English వినసొంపుగా ఉంటుంది. English మాట్లాడాలంటే Grammar బాగా తెలుసుకోవాలి. అయితే Grammar తెలిసినంత మాత్రాన, English బాగా మాట్లాడటం, రాయడం సాధ్యం కాదు.
చాలామంది Grammar తెలియకపోయినా మంచి Englishమాట్లాడగలరు. భాష మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత బాగా వస్తుంది. The best way to learn a language is to speak it అంటారు. అంటే భాషనేర్చుకునేందుకు ఉత్తమమైన మార్గం దాన్ని మాట్లాడటమే. అందుకని మనం -అంటే, English బాగా మాట్లాడాలనుకునే వాళ్లం, వీలైనంతవరకూ Englishమాట్లాడదాం. మాట్లాడిన కొద్దీ బాగా మాట్లాడగలం. మనలో చాలామంది English కొంత మాట్లాడగలిగినా మాట్లాడలేరుఎందుకని? 1) మనం తప్పులు చేస్తే ఇతరులు నవ్వుతారన్న భయంతో; 2) English మాట్లాడితే ఇతరులు మనం ఫోజుకొడుతున్నామనుకుంటారని భయం. ఈ రెండు మర్చిపోండి. కాస్త English అర్థం చేసుకునే వాళ్ల మధ్యలో ఉంటే English మాత్రమేమాట్లాడండి. తప్పులు చేస్తామనే భయం అక్కర్లేదు. తప్పులు అందరూ చేస్తారు.తప్పులతోనైనా మాట్లాడండి. ఎవరైనా మన తప్పు చూపించి సరైందేంటో చెబితేనేర్చుకోవడంలో తప్పు లేదు కదా? అందుకని ఇప్పటినుంచే మీకు వచ్చినEnglishలో నిర్భయంగా మాట్లాడటం ప్రారంభించండి.
|
Vocabulary: English ఏ సందర్భంలో మాట్లాడేందుకైనా Vocabulary తగినంత ఉండాలి. Vocabulary అంటే ఓ భాషలోని మాటలు (Words)/ పదాలు. రోజూవాడే English మాటలు ఓ 3000 ఉన్నాయి. అవి తెలుసుకోవడం చాలా అవసరం. అవి కూడా ఈ పాఠాలతో మీకు వివరిస్తాం.
| |
Listening(వినడం): ఇతరులు మాట్లాడే English కూడా మనం అర్థం చేసుకోగలగాలి; అప్పుడే మనం ఇంకా బాగా మాట్లాడగలం. అందుకే వీలున్నప్పుడల్లా English News Telecasts(T.V.లో) వింటూ ఉండండి. Reading: మంచి English మాట్లాడాలి అంటే వీలైనంత English చదవాల్సిందే. రోజూ English Newspaper, Preferably The Hindu చదవండి, అర్థం అయినా కాకపోయినా. తర్వాత మెల్లమెల్లగా అర్థం అవడం ప్రారంభమై, అక్కడి English మాటల వాడకాలు మీరూ ప్రయోగించడం ప్రారంభిస్తారు.
| |
ఇవన్నీ మీరు పట్టుదలతో చేయగలిగితే English లో సునాయాసంగా మాట్లాడగలరు. English మాట్లాడటం, అంటే Spoken English చాలా సులభం. మనం త్వరలోనే మాట్లాడగలం అనే సుముఖ వైఖరి (Positive Attitude) తో ఆరంభించండి. మీకే ఆటంకం ఉండదు. రోజూ కింది మంత్రం పఠించండి. 1. English is very easy. (English చాలా సులభం) 2. I can speak English. (నేను ఇంగ్లిష్ మాట్లాడగలను.) 3. I will speak English. (ముందు ముందు నేను ఇంగ్లిష్ బాగా మాట్లాడతాను - ఇది నా నిర్ణయం) Let me start NOW (మాట్లాడటం ఇప్పుడే ప్రారంభిస్తాను.) ఈ మంత్రం మీరు రోజూ పఠించండి. దానికి తగిన కృషిచేయండి. మీరు త్వరలోనే చక్కగా మాట్లాడగలరు. |
ఇప్పుడు ఈ lesson ప్రారంభంలో ఇచ్చిన కింది sentences ను గమనించండి. 1) These mangoes are tasty. 2) Are they for me...? 3) Where is dad? 4) How sweet this mango is! పైవన్నీ sentences, ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కటీ పూర్తి అర్థాన్నిచ్చే మాటల కూర్పు కాబట్టి - A sentence is a group of words with complete meaning.
చూడండి:
1. These mangoes are tasty.
( ఈ మామిడి పండ్లు రుచిగా ఉన్నాయి )
అర్థం పూర్తయింది కాబట్టి sentence
2. Are they for me...?
( అవి నాకా? )
ఇది కూడా sentence అర్థం పూర్తయింది కాబట్టి.
అలాగే 3rd and 4th group of words కూడా, sentence అవుతాయి.
ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి:
1st sentence, 'These mangoes' ను గురించి చెబుతోంది. అంటే 'These mangoes' మొదటి sentence కు SUBJECT. అలాగే.
2nd sentence, Are they for me?
'They'ను గురించి చెప్పడం వల్ల, They, second sentence కు subject. ఆ కారణంగానే 3rd sentence, 'dad' and the subject of the 4th sentence is 'Mango'.
అంటే sentence దేన్ని గురించి చెబుతుందో అది దాని SUBJECT. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడిది చూడండి. Sachin plays cricket.
|
ఈ sentence కు subject Sachin, sentence Sachinను గురించి చెబుతోంది కాబట్టి. ఈ sentence లో Sachin (subject) తర్వాత ఏ మాట ముఖ్యమో చూడండి. Plays ముఖ్యం కదా? ఎందుకంటే 'Plays' లేకపోతే, sentence లేదు. (Sachin cricket - అర్థం లేదు). అంటే Sachin తర్వాత 'Plays' అనేది sentenceకు ముఖ్యం; కాబట్టి Plays ఈ sentence లో verb. The boys are playing cricket.
| |
ఇక్కడ verb ఏమిటో చూద్దాం. Subject: The boys. అది తీసేస్తే, sentence కు ముఖ్యమైన మాట (లు) ఏది (వి)? Playing తీసేస్తే, The boys are cricket - అర్థం లేదు, కాబట్టి sentence కాదు. కాబట్టి 'Playing' verb అవుతుంది. 'are' తీస్తే sentence ఉంటుందా? They playing cricket. వాళ్లు cricket ఆడుతూ - అర్థం పూర్తి కాలేదు, కాబట్టి sentence కాదు. కాబట్టి The Boys are playing cricket లో verb: are playing. కాబట్టి VERB: sentence లో subject తర్వాత, ఏమాట/మాటలను తీసేస్తే sentence ఉండదో అది verb అవుతుంది. ఇది చాలా ముఖ్యం. VERB లో ఒక మాట అయినా ఉండొచ్చు; ఒకటి కంటే ఎక్కువ మాటలు (second sentence లో 'are playing' లా) ఉండొచ్చు. She is not coming to the movie.Subject- SheVerb- is coming (not- verbలో భాగంకాదు కదా?) అంటే verb లోని అన్ని మాటలూ ఒకేచోట ఉండాలని లేదు. ఇప్పుడు మీరు కింది sentences లో subject, verb గుర్తించండి. 1) She knows English.2) He is not going out today.3) Where are you working now?4) How well she sings!5) Are you coming to the movie?6) Am I not helping you?7) What he says is not correct.8) She has been studying here for the past three years.9) Why were you standing there?10) How tall the boy is! |
ANSWERS
|
No.
|
Subject
|
Verb
|
1
2
3
4
5
6
7
8
9
10
|
She
He
You
She
You
I
He
She
You
The boy
|
knows
is going
are working
sings
are coming
am helping
is
has been studying
were standingis
|
|
senteceలో Subject, Verbలను గుర్తించడం చాలా చాలా ముఖ్యం. Subject, verb లను సరిగ్గా గుర్తించగలిగితే English మాట్లాడటం చాలా తేలికవుతుంది. కాబట్టి sentence ను చూడగానే, దాని subject, verb ఏవో చెప్పగలగాలి. దీనివల్ల అన్నీ మనకు సులభమవుతాయి.
|
తెలుగుకూ English కూ ముఖ్యమైన తేడా: తెలుగులో మాటల వరస (Order of words in a sentence) ఏ మాట ముందూ, ఏ మాట తర్వాత అనే విషయానికి అంత ప్రాముఖ్యంలేదు. వాక్యంలోని మాటలను ముందూ వెనుకా చేసినా అర్థం మారదు. జానకి ఆ పుస్తకాన్ని కొన్నది. ఆ పుస్తకాన్ని జానకి కొన్నది. కొన్నది ఆ పుస్తకాన్ని జానకి. Sentence లోని words ఎక్కడికి మార్చినా అర్థం మారదు. అదే English లో ప్రయత్నిద్దాం. a) Janaki bought a book. ఇందులో మాటల వరస మార్చండి. b) A book bought Janaki a) కి అర్థం 'జానకి పుస్తకాన్ని కొన్నది' అని కదా? అయితే b) అర్థం. పుస్తకం జానకిని కొన్నది. " అలాగే Rama killed Ravana, Ravana killed Rama కి అర్థంలో చాలా తేడా ఉంది కదా? రెండోది, మొదటిదానికి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది English sentenceలో మాటల క్రమం (word order) చాలా ముఖ్యం అని కదా. ముందు ఇది పరిశీలించి అర్థం చేసుకుంటే మన English correctగా ఉంటుంది.
learn the spoken english part II
Snigda: All our friends are here. We can start our programme. (మన స్నేహితులందరూ ఉన్నారు. కార్యక్రమం ప్రారంభించవచ్చు.) |
Chitra: Certainly but let's check once again. Is Chandana here? (తప్పకుండా. అయినా ఒక్కసారి చూసుకుందాం. చందన ఉందా?) Chandana: I am here of course. Come on. Is Charita coming too? (నేనిక్కడే ఉన్నా కదా! కానీ, చరిత కూడా వస్తోందా?) | |
Snigda: Why are you asking? Look. She is standing next to the table. (ఎందుకు అడుగుతున్నావు? చూడు. తను టేబుల్ పక్కనే నిలబడి ఉంది.) Chandana: Are you waiting for anyone else, Chitra? Why don't you go ahead and cut the cake? Is n't it getting late? (నువ్వు ఇంకా ఎవరికోసమైనా చూస్తున్నావా? చిత్రా? కానీ.... కేక్ఎందుకు కోయడం లేదు? ఆలస్యం కావడం లేదా?) Who else - ఇక్కడ else = ఇతర/ఇంకా who else? ఇంకెవరన్నా; What else = ఇంకేదైనా, Why else? = ఇంకెందుకు? / మరే కారణం వల్ల? |
Chitra: All right. No more delay. I am cutting the cake, now itself. (సరే అయితే. ఇంకేం ఆలస్యం లేదు. ఇప్పుడే కేక్ కోసేస్తున్నా.)Look at the following sentences: 1) All our friends are here. 2) She is standing next to the table. 3) Is Chandana here? 4) Why are you asking? |
| Sentences (1) and (2) ను statements అంటాం. అంటే ఒక విషయాన్ని తెలిపేవి/ చెప్పేవి. ఇప్పుడు statements (1) and (2) లో word order చూద్దాం: 1) All our friends are here. subject verb |
ఇది statement. ఇందులో word order ఏంటి? subject ముందూ, verb తర్వాత (subject + verb) వస్తాయి. 2) She is standing next to the table sub verb | |
ఇది కూడా statement. ఇందులో కూడా subject first, verb next కదా. అంటే Englishలో ఏ statementలో అయినా word order: subject (sub) + Verb (vb). ఇంకా వివరంగా చెప్పాలంటే sub+verb word order ఉన్న sentences లన్నీ కూడా statements అవుతాయన్నమాట. 3) Is Chandana here? ఇది question కదా? దీని word order చూద్దాం: Is Chandana here? verb subject చూశారా? Question word order: Verb + subject (statement word order: subject + verb గుర్తుంది కదా?) అంటే statement word order: sub + verb question word order: verb + subject. English లో ఇది చాలా ముఖ్యమైన తేడా. Is India a big country - దీని word order: verb subVerb + sub orderలో ఉంది. కాబట్టి ఇది question అవుతుంది. అందుకే sentence చివర question mark (?) పెడతాం. Is india a big country ? ఈ తేడా statement కూ, question కూ మధ్య, బాగా తెలుసుకుని మీ సంభాషణలో ఉపయోగించుకోగలిగితే, మీ Spoken English correct గా ఉంటుంది. పై సంభాషణ (Conversation) నుంచే ఇంకో question చూద్దాం: Is Charitha coming? ఈ question లో Charitha, subject. Is coming, verb కదా? అయితే ఇక్కడి verbలో is, coming అని రెండు మాటలున్నాయి. Verb లో ఇలా రెండు మాటలున్నప్పుడు, మొదటి మాటను Helping Verb (HV) అని, తర్వాతి మాట(ల)ను, Main Verb (MV) అని అంటాం. |
పై question word order: Is Charitha coming? HV + sub + MV అంటే question word order రెండు విధాలుగా ఉండొచ్చు. 1) Vb + sub (Are you a student?) verb sub 2) HV + sub + MV ( Is + Charitha + coming ?) HV sub MV గమనించండి: Question లో subject ఎప్పుడూ verb తర్వాత లేదాHelping verb తర్వాత ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. కిందిquestions చూడండి. 3) What is your name? Word order: 'Wh' word + Verb + Sub 4) Why are you asking? Word order: 'Wh' word + HV + Sub + MV (HV - Helping Verb; MV - Main Verb) Qs 3 and 4లో కూడా verb తర్వాత లేదా helping verb తర్వాతsubject రావడం చూశారు కదా? అయితే పైన 1, 2 ప్రశ్నలకూ; 3, 4ప్రశ్నలకూ తేడా గమనించండి. 1, 2 ప్రశ్నలు Verb/ Helping verb తోప్రారంభమవుతాయి. 3, 4 'Wh' words తో ప్రారంభమవుతున్నాయికదా? |
| 'Wh' words అంటే, Wh తో ప్రారంభమవుతాయి. సామాన్యంగా questions అడిగేందుకు వాడే మాటలు: What = ఏది/ దేన్ని? When = ఎప్పుడు? Where = ఎక్కడ? Which = ఏది? (వస్తువులతో; రెండు అంతకు మించిన వారిలో/ వాటిలో ఏది?) Why = ఎందుకు? |
Who = ఎవరు? ఎవరిని/ ఎవరికి? (ఈ అర్థంతో Whom అని కూడా అంటాం) Whose = ఎవరి? / ఎవరిది? పైవన్నీ 'Wh' words. English లో questions రెండు రకాలు: 1) 'Wh' words తో ప్రారంభమైన 'Wh' questions. e.g.: Where are you? 2) 'Wh' words లేని 'Non-wh' questions e.g.: Are you an Indian? ('Wh' question అయినా Non-wh question అయినా, subject ఎప్పుడూ verb తర్వాత లేదా Helping verb తర్వాత వస్తుందనేది గుర్తుంచుకోవాలి.) Q: Where is he? ('Wh' question) A: He is in Hyderabad (Statement) చూశారు కదా? 'Wh' questions కెప్పుడూ answer, statement రూపంలోనే ఉంటుంది. Q: Is he your friend? (Non-wh question) A: Yes, he is.../ No, he is not... Non-wh questions కెప్పుడూ answer లో Yes/ No ఉంటుంది. |
Now, ask questions to get the following answers: (for YES/NO answers, the question is a 'non-wh' question, and for statements, it is 'wh' question) Q-1: ----- ? A: Yes, his friends are here Q-2: ----- ? A: They are coming tomorrow Q-3: ----- ? A: No, Shyam was not here yesterday | |
Q-4: ----- ? A: Yes, Mr. Kiran Kumar Reddy is the CM of A.P. Q-5: ----- ? A: Hyderabad is in Andhra Pradesh Q-6: ----- ? A: My friend was here yesterday.
Answers to the exercise above.
Answer 1, Yes తో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది 'Non-Wh' Question. Q-1: Are his friends here? (Non-Wh) Answer 2 లో Yes/No లేదు కాబట్టి, ఇది 'Wh' question కావాలి. Q: Who are coming tomorrow? / When are they coming? (Yes/No లేకుండా వచ్చే answer, ఒకటి కంటే, ఎక్కువ questions కు answer కావచ్చు) Q-3: Was Shyam here yesterday? Q-4: Is Mr. Kiran Kumar Reddy the CM of AP? Q-5: Where is Hyderabad? Q-6: Who was here yesterday? / When was your friend here? ఇలా వీలైనన్ని questions మీ friends, brothers and sisters తో practise చేయండి. ఇది చాలా అవసరం. Q. What was he doing there? ఈ question లో, was, HV; doing-MV. కదా. దీనికి జవాబు చూడండి. He was reading a book. Spoken English నేర్చుకోవడానికి, అంటే English లో ధారాళంగా మాట్లాడాలంటే మీరు చేయాల్సింది: verb conjugation తెలుసుకోవడం. అంటే verb కు, past tense, past participle తెలుసుకోవడం. ఇవి కిందివిధంగా ఉంటాయి. |
ఈconjugation తెలిసిఉండటం చాలాఅవసరం. చాలాverbs, past tense, past particple, +edచేర్చి (Talk, talked, talked)లేదా +d చేర్చి (like, liked, liked) లేదా+t చేర్చి (smell, smelt, smelt) form చేస్తాం. | |
కొన్ని verbs కు మాత్రం (give, gave, given) ఒక పద్ధతి లేకుండా (irregular గా) form అవుతాయి. వీటినినేర్చుకోవడం ముఖ్యం. ఇవి ఏ grammar book/Oxford, Cambridge,Longman's Dictionaries లో అయినా దొరుకుతాయి. కంఠస్థంచేయండి. ఇప్పుడు మనం daily life లో ఎక్కువగా వాడే కొన్ని మాటలు(vocabulary) చూద్దాం.
|
Parts of the human body
Head, face, eyes, ears, neck, nose, shoulders, fingers, legs లాంటి మాటలు అందరికీ తెలుసు. ఇవి చూడండి. forehead = నుదురు, eyelids = కనురెప్పలు; eyebrows = కనుబొమ్మలు; eyelash = కనురెప్ప లోపలి భాగం; nose bridge = ముక్కుమీద కళ్లజోడు ఆనేచోటు; right nostril, left nostril = ముక్కు రంధ్రాలు. gums = పంటి చిగుళ్లు; jaw = దవడ ear lobe = చెవులకు కమ్మలు, రింగులు తగిలించే భాగం chin = గడ్డం (వెంట్రుకలు లేని); ribs = పక్క ఎముకలు spine/backbone = వెన్నెముక; hand = అంటే హస్తం మాత్రమే; wrist = మణికట్టు; arm = మణికట్టు నుంచి భుజాల వరకు ఉండే చేయి. elbow = మోచేయి; forefinger = చూపుడు వేలు; little finger = చిటికెనవేలు; thumb = బొటనవేలు ; stomach = కడుపు/ పొట్ట. waist = నడుము. backside = buttocks = పిరుదులు. lap = ఒడి; knee = మోకాలు; shin = కాలిముందరి భాగం; calf = కాలి వెనుక భాగం; ankle = కాలికి పాదానికీ మధ్య కీలు (చీలమండ); toes = కాలివేళ్లు; big toe = కాలిబొటనవేలు. heel = మడమ. sole = పాదం అడుగు భాగం, instep = పాదంపైభాగం.
LEAN THE SPOKEN ENGLISH PART III
Mukund: I am happy today. The books are here. This book with the green cover is more interesting than the other two books. (ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాలు ఇక్కడున్నాయి. పచ్చ అట్టతో ఉన్న ఈ పుస్తకం మిగతా రెండింటి కంటే ఆసక్తికరంగా ఉంది.)
| |
|
Govind: Yes. I have read it. It is about Einstein, the great scientist. It is a biography, but is more like a story. (అవును. నేను దాన్ని చదివాను. అది ఐన్‌స్టైన్ అనే గొప్ప శాస్త్రవేత్తను గురించి. అది జీవితచరిత్రే. కానీ అదో కథలా ఉంది.) Mukund: I am an admirer of Einstein and so are you, I think. Einstein himself was a great admirer of Gandhi. The two were really great men.
|
(నేను ఐన్‌స్టైన్ అభిమానిని. నువ్వు కూడా అనుకుంటా. ఐన్‌స్టైన్ గాంధీ అభిమాని. ఆ ఇద్దరూ చాలా గొప్ప వాళ్లు). Admire = మెచ్చుకోవడం, అభిమానించడం. Admirer = అభిమాని = fan Govind: Most people are full of respect for the two. They were such geniuses. (చాలామందికి ఆ ఇద్దరంటే అభిమానం. అలాంటి మేధావులు వాళ్లు). |
Mukund: Einstein is famous for his scientific discoveries. Gandhi is famous for his discovery of peace and non-violence as a weapon against Britishers. (సైన్స్‌లో కొత్త విషయాలు కనుక్కుని ఐన్‌స్టైన్ ప్రసిద్ధికెక్కాడు. అలాగే గాంధీ కూడా బ్రిటిషర్లను అంతమొందించేందుకు శాంతి, అహింస అనే ఆయుధాలు కనిపెట్టి ప్రసిద్ధికెక్కాడు.)
| |
famous = ప్రసిద్ధి చెందిన/ పేరున్న fame = ఖ్యాతి/ ప్రసిద్ధి Violence = హింస / దౌర్జన్యం Non-violence = అహింస Govind: That's why the world is grateful to them. (అందుకే ప్రపంచం వాళ్లకెప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది.) Greatful = కృతజ్ఞత ఉన్న |
* * *
|
తెలుగు వాక్యంలో word order (ఏ మాట ముందు, ఏ మాట తర్వాత అనేది) కు, English sentence లో word order కూ చాలా తేడా ఉంటుందని కిందటి lesson లో చూశాం కదా? తెలుగు వాక్యంలో సామాన్యంగా ఏ మాటను ఎటు మార్చినా అర్థం మారదు. e.g..: గోవింద్ పామును చంపాడు. ఈ వాక్యంలో మాటల positionను ఎటు మార్చినా అదే అర్థం వస్తుంది. చూడండి. పామును గోవింద్ చంపాడు చంపాడు పామును గోవింద్ గోవింద్ చంపాడు పామును. ఇలా ఏ మాట ఎక్కడున్నా వాక్యం అర్థం మారదు. కానీ English లో అలాకాదు. ఉన్నచోటి నుంచి మాటను మారిస్తే అర్థం మారిపోతుంది. చూడండి: |
|
Govind killed a snake = గోవింద్ పామును చంపాడు A snake killed Govind= పాము గోవింద్‌ను చంపింది. చూశారు కదా? ఎంత తేడా ఉందో. అందుకే English లో word order in a sentence is very important Second Point:English లో statement (ఏదైనా ఒక విషయం చెప్పే sentence) కూ, Question (ప్రశ్న)కూ word order లో చాలా తేడా ఉంటుంది.
|
Statement: He is here (అతనిక్కడ ఉన్నాడు.) Subject + Verb అంటే statement లో ఎప్పుడూ subject ముందు, దాని తర్వాత verb వస్తాయి. Question: Is he here? (అతడిక్కడ ఉన్నాడా?) Verb + Subject ఇది ఇంతకు ముందు lesson లో చూశాం కదా? | |
ఇప్పుడిది గమనించండి: English లో verb చాలా ముఖ్యం. తెలుగులో చాలావరకు verb అంతగా వాడం. look at the following. Ram is Mukund's friend.అర్థం: రామ్, ముకుంద్ స్నేహితుడు. Ram is Mukund's friend అనడంలో, Ram subject, is verb కదా? తెలుగు వాక్యంలో చూడండి: Ram కు, రాం అని ఉంది, Mukund's friend కు ముకుంద్ స్నేహితుడు అని ఉంది. కానీ English లోని is (verb) కు తెలుగులో ఏ మాటాలేదు కదా! ఇలా తెలుగులో verb ను మనం అంతగా పట్టించుకోం . 'రాం, ముకుంద్ స్నేహితుడు' అంటామే కానీ రాం, ముకుంద్ స్నేహితుడిగా ఉన్నాడు (= is) అనం. Dasaradha is Sri Rama's father (దశరథుడు శ్రీరాముడి తండ్రి) (is = ఉన్నాడు) తెలుగులో 'is' కు ప్రాముఖ్యం ఇవ్వం. కానీ ఇంగ్లిష్‌లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.verb లేనిదే sentence ఉండదు. Now look at the following sentences from the conversation (సంభాషణ) at the beginning of the lesson. |
1) The books are here 2) It is about Einstein 3) I am an admirer of Einstein 4) It is a biography, but it is more like a story. 5) I am an admirer of Einstein 6) Einstein himself was an admirer of Gandhi 7) The two were really great men The words am, is, are, was and were, underlined above are all verbs. 1) The books are here= పుస్తకాలిక్కడ ఉన్నాయి. 2) It is about Einstein= అది ఐన్‌స్టైన్ ను గురించి. చూశారా తెలుగులో Einstein ను గురించి, అని వదిలేస్తాం. కానీ English sentence లో is అనే verb లేకపోతే తప్పు. అలాగే 3) I am an admirer of Einstein = నేను ఐన్‌స్టైన్ అభిమానిని - ఇక్కడ కూడా English లో am (ఉన్నాను) కు తెలుగు లేదు. 4) It is a biography, but it is more like a story. అది జీవిత చరిత్రే. (is తెలుగులో = ఉంది. తెలుగులో వాడం) కానీ కథలా ఉంది.(is) 5) I am an admirer of Einstein = నేను ఐన్‌స్టైన్ అభిమానిని - అంటే చాలు. am కు కూడా తెలుగు చెప్తే, గా ఉన్నాను అనాలి. కానీ అలా అనం కదా. 6) Einstein was an admirer of Gandhi = ఐన్‌స్టైన్ గాంధీ అభిమాని. (గా ఉండేవాడు = was) 7) The two were really great = ఆ ఇద్దరూ నిజంగా గొప్పవాళ్లు (గా ఉండేవాళ్లు = were) ఇంకో విషయం. English లో verb ఎప్పుడూ, subject వెంటే ఉంటుంది. తెలుగులో ఎక్కడ ఉన్నా ఫరవాలేదు. కానీ ఎక్కువగా వాక్యం చివర వస్తుంది. Now, in the sentences below, point out the sentences in which Telugu words for English am, is, are, was and were are omitted. (కింది English sentences లో am, is, are, was, were లకు మాటలు తెలుగులోని sentences ను గుర్తించండి) 1. We are Indians. 2. Are you an actor? 3. The books are on the table 4. My friends are all in jobs. 5. Where is he? 6. Why are you here? 7. We were in Chennai yesterday? 8. His books were here an hour ago 9. The movie was good.
Answer
1. మనం భారతీయులం - are కు ఇక్కడ తెలుగు మాట లేదు. 2. నువ్వు నటుడివా? - 'Is' కు తెలుగు లేదు 3. పుస్తకాలు table మీద ఉన్నాయి - ఇక్కడ ఉన్నాయి = are 4. మా స్నేహితులందరూ ఉద్యోగాల్లో ఉన్నారు (ఇక్కడ ఉన్నారు = are) 5. Where is he? అతనెక్కడ? - is తో కలిపి, అతనెక్కడ ఉన్నాడు (is)? అనాలి, కానీ అతనెక్కడ? అని ఆపేస్తాం. (is = ఉన్నాడు అనేది వదిలేస్తాం) 6. Why are you here? (నువ్వెందుకున్నావిక్కడ? - are ఉన్నావు) 7. మేం నిన్న చెన్నైలో ఉన్నాం - were = (గతంలో) ఉన్నాం 8. అతడి పుస్తకాలు గంట ముందు ఇక్కడ ఉన్నాయి. were = గతంలో ఉన్నాయి - were తెలుగులో 9. ఆ సినిమా బాగుండింది (was = ఉంది) మనం నేర్చుకున్న విషయం: తెలుగులోలా Englishలో, ఉన్నాయి, ఉంది, ఉన్నాం etc తెలిపే verbను వదిలేయడానికి వీల్లేదు. ప్రతి English sentenceలో verb ముఖ్యం. |
|
ఈ verbను గురించి తెలుసుకోండి: Am/ is/ are= ఉండటం - ఇప్పుడు (Now), ఎప్పుడూ (always), క్రమం తప్పకుండా (Regularly). I am/ He, She, It is/We, you, they అంటే Am ఎప్పుడూ I తో, Is ఎప్పుడూ, He, she, it తో, are ఎప్పుడూ, we, you, they తో వాడతాం. ఇప్పుడూ, ఎప్పుడూ, క్రమం తప్పకుండా 'ఉండటం' అనే అర్థంతో. అలాగే was/were = past (గతంలో) ఉండటం. I/ he/ she/ it - was we/ you/ they - were. అంటే plural number కు were వాడతాం. (Am, is, are, was, were - ఈ verbs 'be' forms (ఉండటం - వివిధ కాలాల్లో అని అర్థం వచ్చే verb) లో కొన్ని. ఇప్పుడు చూడండి: a) I am at home (నేనింట్లో ఉన్నాను -ఇప్పుడు) I am at home on Sundays (అన్ని ఆదివారాలు/ ప్రతి ఆదివారం నేనింట్లోనే ఉంటాను (Regular)). b) The Sun (it) is in the east in the mornings (ప్రతి ఉదయం సూర్యుడు తూర్పున ఉంటాడు. (Regular)). c) My friend (he/ she) is at home (మా స్నేహితుడు/ స్నేహితురాలుఇప్పుడు ఇంట్లో ఉన్నాడు/ ఉంది.) d) The students are in class (విద్యార్థులు class లో ఉన్నారు (ఇప్పుడు)). e) India was under British rule till 1947. (1947 వరకు భారత్ బ్రిటిష్ పరిపాలనలో ఉండేది (గతం)). f) The British were our rulers till 1947. (1947 వరకు British వాళ్లు మన పాలకులుగా ఉండేవాళ్లు - గతం. British వాళ్లు, plural కాబట్టి, were) g) I am not in Vijayawada (నేను విజయవాడలో లేను (ఇప్పుడు)). h) Am I your enemy (నేను నీ శత్రువునా? Question కాబట్టి Am (verb) తర్వాత I (subject) వస్తుంది కదా?) i) She is not a student (ఆమె విద్యార్థిని కాదు) j) Is she not a student? (ఆమె విద్యార్థిని కాదా?) ఇక్కడ కూడా question కాబట్టి is (verb) తర్వాత she (subject). k) Your books are not here (నీ పుస్తకాలిక్కడ లేవు - ఇప్పుడు) l) Where are your clothes? (నీ దుస్తులెక్కడ ఉన్నాయి? - ఇప్పుడు)
LEARN THE SPOKEN ENGLISH PART IV
కింది Examples గమనించండి. was = గతంలో ఉండటం. Singular subjects (I/He/She/It) కు was. were = గతంలో ఉండటం. Plural subjects (we/you/they) కు were. a) I was in Nellore yesterday. (నేను నిన్న నెల్లూర్లో ఉన్నాను (గతం)) | |
b) I was not a student of that college. (నేను ఆ కళాశాల విద్యార్థిని కాను. (ఉండలేదు)) c) Was he your classmate? (అతడు నీ క్లాస్‌మేటా? (గతంలో)) d) Was she not here last month? (ఆమె గత నెల ఇక్కడ లేదా?) |
పోల్చండి: Was she here last month? (ఆమె గత నెల ఇక్కడ ఉండిందా?) e) Wherewere you last night? (నిన్న నువ్వెక్కడన్నావు?/ మీరెక్కడున్నారు?- you = నువ్వు/ మీరు) f) Why were the students here? (ఆ విద్యార్థులు ఇక్కడెందుకున్నారు? - గతంలో)
| |
EXERCISE |
Put the following sentences in English. కింది sentences ను English లో బిగ్గరగా practice చేయండి. 1) మనమందరం స్నేహితులం (ఇప్పుడు) 2) ఆ విద్యార్థులు ఇప్పుడిక్కడ ఉన్నారా? 3) శంకర్ నిన్న ఇక్కడ ఉన్నాడా? 4) కుమార్, కిరణ్ నిన్న ఇక్కడ లేరు. 5) మీరు 2007లో ఇక్కడ లేరు. 6) జగదీష్ నీ స్నేహితుడా? (ఇప్పుడు) 7) మీరిప్పుడు classmates. School లో కూడా క్లాస్‌మేట్సేనా? 8) ఆ రోజుల్లో నేనంత clever (తెలివైన) student ను కాను. 9) నేను భారతీయుడిని కానా? 10) నిన్న నువ్వు ఎక్కడున్నావు? 11) నువ్వు ఆ School విద్యార్థివి కావా? (గతంలో) 12) నిన్న నేనున్నానక్కడ, నువ్వు లేవా? 13) మొన్నటి question paper చాలా కష్టంగా ఉండింది. 14) నెహ్రూ పొడుగు (tall) కాదు 15) గాంధీ ఆంధ్రుడు కాదు. |
Answers:1) We are (ఇప్పుడు) all friends.2) Are the students here?3) Was Sankar here yesterday?4) Kumar and Kiran were not here yesterday?5) You were not here in 2007 | |
6) Is Jagadish your friend?7) You are classmates (now). Were you classmates at school too?8) I was not a clever student those days.9) Am I not an Indian?10) Where were you yesterday?11) Were you not a student of that school?12) I was there yesterday. Were you there too?13) The question paper the day before yesterday (మొన్న) was tough14) Nehru was not tall.15) Gandhi was not an Andhra. |
Exercise:Below is a list of words. Following them are some sentences, each with a blank.Fill in the blanks with suitable words from the list. Some blanks can be filled withmore than one word.కింద కొన్నిమాటలూ, వాటి తర్వాత ఖాళీలున్న కొన్ని వాక్యాలూ ఉన్నాయి. ఆ ఖాళీలను మాటలతో పూరించండి. ఒక్కో ఖాళీ రెండు, మూడు మాటలతో కూడా నింపొచ్చు. సరైన 'be' forms (am, are, was, were) వాడండి. Words:Happy (సంతోషంగా ఉన్న) Sad (దుఃఖంగా ఉన్న), interesting (ఆసక్తికరంగా ఉన్న), boring (విసుగు కలిగించే), tall (పొడవుగా ఉన్న) × short (పొట్టిగా ఉన్న) actor at college, in the book, clever, foolish etc.ఇవేకాకుండా సరైనవి, మీకు తోచిన వాటితో కూడా నింపవచ్చు. e.g.: 1. Now, I ............ (be) ............ [be = am, is, are, was, were లలో ఏదైనా ] Ans: Now I am happy / sad / foolish etc.2. The movie yesterday ............ (be) ............ 3. (be) you ............ now? 4. (be) the picture ............? 5. They are ............ 6. The story ............ (be) ............ 7. The pictures ............ (be) ............ in the book. 8. Why ............ (be) you ............? 9. ----(be) it a clever thing to do? 10. Why ............ (be) you so happy last night? Answers: 2. The movie yesterday was interesting / boring.3. Are you happy / sad now?4. Was/as the picture interesting? / boring? / in the book?5. They are happy / sad / clever / tall / short / dull / fat - ఇలా ఎన్నిమాటలైనా వాడొచ్చు కదా? * They (ఒకవేళ వస్తువులైతే) are cheap / costly / beautiful / heavy (బరువు) not good / not bad / from America etc.6. The story was / is interesting / boring / lengthy / short / dull (uninteresting)7. The pictures are / were in the book.8. Why -are you there? Why Were you there? Why are you / were you happy? / sad? / interested? / dull? etc.9. Is / was it a clever thing to do? 10. Why were you so happy last night? (so happy = అంత సంతోషంగా) The 'be' forms Am/ is/ are/ was/ were తర్వాత గుణాలు తెలిపే పదాలేవైనా రావచ్చు. పరిస్థితిని తెలిపే పదాలూ రావచ్చు: Happy, sad, clever, tall, short, fat, jealous (అసూయ), beautiful, ugly, intelligent, handsome, nice, fire, ill (జబ్బుతో ఉండటం), well (కులాసాగా ఉండటం), good, bad, helpful etc. అలాగే వ్యక్తి / వ్యక్తుల వృత్తులూ చెప్పవచ్చు He / she is a teacher.My friends are actors.The boy is cricketer/ footballer.All the students are singers etc.,ఇలా వీటితో వీలైనన్ని sentences practice చేయండి. ఇలాగే questions కూడా practice చేయండి. What are they? (వాళ్లేం ఉద్యోగం చేస్తారు?) Where are your Friends? How is the movie? (సినిమా ఎలా ఉంది?) 'Wh' words అంటే 'Wh' తో ప్రారంభమయ్యే మాటలు. What = ఏది?/ఏమిటి? When = ఎప్పుడు? Where = ఎక్కడ? Who = ఎవరు? Whose = ఎవరి/ఎవరిది? Why = ఎందుకు? How = ఎలా? Whom = ఎవరిని?/ఎవరికి? How well/ How good? = ఎంత బాగా? How tall? = ఎంత పొడుగు Vocabulary అంటే తెలుసుకదా? ఒక భాషలో ఉన్న పదాల (మాటల)న్నీ. English Vocabulary = English లోని మాటలన్నీ. Telugu Vocabulary = తెలుగులోని మాటలన్నీ. A person's Vocabulary = ఒక వ్యక్తికి ఒక భాషలో తెలిసిన మాటలు. Good Vocabulary = చాలా మాటలు తెలిసి ఉండటం. Poor Vocabulary = కొన్ని మాటలు మాత్రమే తెలిసి ఉండటం. Now look at the basic (మౌలిక = అతి ముఖ్యమైన, Daily life లో వాడే) vocabulary చూద్దాం. మొదట మన శరీరం, అవయవాలకు english మాటలు:
|
తల = Headతలపై చర్మం (జుట్టుండే చోటు) = Scalpకణితలు = Right temple, left temple నుదురు/ పాలభాగం = Forehead | |
కనుబొమ్మలు = Eyebrowsకనురెప్పలు = Eye lids; singular - Eye lid కంటిరెప్ప లోపలిభాగం/ (కాటుకపెట్టే చోటు) = Eye lash | |
కళ్లజోడు ఆనే ముక్కు పైభాగం = Nose bridgeముక్కు రంధ్రాలు = Nostrils (Right nostril, left nostril) ముక్కు కొన = Tip of the nose | |
కమ్మలు తగిలించే చెవి భాగం = Ear lobe | |
మీసం = Mustache (ముస్టాష్) గడ్డం/ చెంపలపై వెంట్రుకలు = Beard (బియడ్) | |
చెంప = Cheek (Right/ Left)గడ్డం (వెంట్రుకలు లేకుండా) పంటికింది భాగం = Chin | |
పెదవులు = Lips పళ్లు = Teeth (tooth - పన్ను) దవడ = Jawచిగుళ్లు = Gums (upper/ lower gum) | |
గొంతు (మింగేటప్పుడు) = throatమెడ = Neck మెడ వెనుక భాగం = Nape (నెయ్‌ప్) | |
భుజం = Shoulderచెయ్యి = Armహస్తం = Hand (English లో hand అంటే ముంజేతి నుంచి వేళ్ల వరకు మాత్రమే. ముంజేయి (Wrist) నుంచి భుజం వరకు, 'Arm'. | |
పొట్ట = Stomachఛాతీ = Chestస్త్రీల వక్షస్థలం = Breasts (ఇదెప్పుడూ breasts అని plural గానే వాడతాం) డొక్కలు = Sides | |
వీపు = Backవెన్నెముక = Backbone/ spine నడుము = Waist Hip = నడుము చివరిపక్క (మనం చేతులు ఆన్చుకుని నిలబడేటప్పుడు, Hipsమీద ఆన్చుతాం) పిరుదులు = Buttocks | |
గజ్జలు = Groinతొడ = Thighమోకాలు = Kneeకాలు = Leg పాదం = Foot పాదం కాలుతో కలిసేచోటు = Ankle (చీలమండ) మడమ = Heel | |
పాదం అడుగుభాగం (నేల మీద ఆనే భాగం) = Sole కాలివేళ్లన్నీ = Toe (Singular), Toes (plural) కాలిబొటనవేలు = Big toe | |
చేతి బొటనవేలు = Thumbచూపుడు వేలు = Fore fingerమధ్య వేలు = Middle fingerఉంగరపువేలు = Ring fingerచిటికెన వేలు = Little finger | |
అరచేయి = Palm (అరచేతి రేఖలను చూసి చెప్పే జ్యోస్యం = Palmistry; అలా జ్యోస్యం చెప్పేవారు = Palmist.) గోళ్లు = Nail (s) జుట్టు = Hair ఎముక = Bone | |
చర్మం = Skinమాంసం = Fleshనరం = Nerveకండరం = Muscle కీలు = Joint పురుషాంగం = Peniceస్త్రీ మర్మాంగం = Vagina (వెజైనా |
|
|
|
|
|
|
|
|
LEARN THE SPOKEN ENGLISH PART V
Darsika: Where are your friends? Are they here? (మీ స్నేహితులెక్కడ? వాళ్లిక్కడ ఉన్నారా?). Deepika: They are. In fact they have been here for the past ten minutes. Is the coffee ready? (ఇక్కడే ఉన్నారు. ఇప్పుడేంటి? గత పది నిమిషాలుగా ఇక్కడే ఉన్నారు. కాఫీ సిద్ధంగా ఉందా?) (In fact = ముందన్నదానికి, విరుద్ధంగా ఏదైనా అంటున్నప్పుడు/ యథార్థంగా అనే అర్థంతో వాడతాం.)
|
Darsika: They were here last Sunday too, weren't they? (వాళ్లు పోయిన ఆదివారం కూడా ఇక్కడ ఉన్నారు కదా?) Deepika: Yea. They came here last Sunday to borrow some books from me. I gave them the books. They have come here to return the books. (కిందటి ఆదివారం నా దగ్గర కొన్ని పుస్తకాలు (అరువు) తీసుకునేందుకు వచ్చారు. నేను వాళ్లకు ఆ పుస్తకాలిచ్చాను. ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వడానికి వచ్చారు.)
|
Darsika: They seem to be good. When will they be here again? (వాళ్లు మంచివాళ్లుగా కనిపిస్తున్నారు. మళ్లీ ఎప్పుడుంటారిక్కడ?) Deepika: They may be here next Sunday too. I shall be happy to have them here frequently. (వచ్చే ఆదివారం కూడా వాళ్లిక్కడ ఉండవచ్చు. వాళ్లిక్కడ తరచూ ఉండటం నాకు సంతోషంగా ఉంటుంది.) Frequently (తరచుగా) ´ rarely (అరుదుగా).
| |
Darsika: How far is their place from here? (వాళ్లిల్లు ఇక్కడికెంత దూరం?) far (దూరం) ´ near (దగ్గర); how far? = ఎంత దూరం? Deepika: Not very far; about a kilometre and a half. They can be here in 15 minutes if they walk. (పెద్దదూరం ఏం కాదు. దగ్గర దగ్గర కిలోమీటరున్నర. నడిచి వస్తే 15 నిమిషాల్లో ఇక్కడ ఉండగలరు.) Darsika: But they have a vehicle, don't they? If they come on it, it should take much less than that. (వాళ్లకేదో వాహనం ఉన్నట్టుంది కదా? దానిమీదైతే ఇంకా తక్కువ సమయం పట్టాలి.) Deepika: It does. Get the Coffee then. I will call them. (అవును. కాఫీ తీసుకురా. వాళ్లను పిలుస్తాను నేను.) Look at the following sentences: 1) They have been here for the past ten minutes. 2) They came here last Sunday to barrow some books. 3) I gave them the books. 4) When will they be here again? 5) They may be here again next week. 6) I shall be happy. 7) They can be here in ten minutes if they walk. 8) It should take much less than that. 9) I will call them. |
పైన underline చేసిన మాటలన్నీ verbs. (Verbs అంటే గుర్తుంది కదా? sentence లో Subjec తర్వాత sentence కు ఏమాట ముఖ్యమో అది verb.) పై sentences లోని verbs చూద్దాం. | |
ఇప్పుడు మీరు తెలుసుకునే విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకుని గుర్తుంచుకోండి. ఇవి మీకు గుర్తుంటే English మాట్లాడటం సులభం అవటమే కాకుండా, confusion ఉండదు. పైన A కింద తెలిపిన verbs, 'Be' forms. వీటి చివర 'be'/ 'been' వస్తుంది గమనించండి. ఇలా 'be'/ 'been' చివర వచ్చే verbs ను 'be' forms అంటాం. 'Be' forms అంటే ఉండటం అని అర్థం వచ్చే verbs. ఇంతకు ముందు చూశాం కదా? కొన్ని 'be' forms 1) am, is, are = ఇప్పుడు/ ఎప్పుడూ/ మామూలుగా/ సాధారణంగా ఉండటం. 2) was, were = గతంలో ఉండటం. B కింద తెలిపిన verbs అన్నీ 'Active words' అంటే పనిని తెలిపే పదాలు. చూడండి. e.g.: came = వచ్చాడు/ వచ్చాను/ వచ్చారు- పని. అంటే English లో రెండు రకాల verbs ఉన్నాయన్నమాట. 1) Be forms: అన్ని 'be' forms కు అర్థాలు 'ఉండటం' అనే దాని వివిధ రూపాలుగా ఉంటాయి. ఇవి మూడు sets గా ఉంటాయి. Set - 1: Am, is, are, was, were Set - 2: చివర 'be' వచ్చేవి. |
|
Set-3: చివర 'been' వచ్చేవి. |
పైవన్నీ వివిధ రకాల ఉండటాన్ని తెలుపుతాయి. అన్ని verbs. ఇప్పుడు B కింద తెలిపిన verbs చూడండి. ఇవి action words అంటే పనిని తెలిపేవి. borrow = అరువు తీసుకోవడం (పని - action word) gave = ఇచ్చాను/ ఇచ్చాడు/ ఇచ్చాం/ ఇచ్చారు (పని - action word). walk నడవడం (పని - action word). should take = తీసుకోవాలి - (పని - - action word) will call -(భవిష్యత్‌లో) పిలుస్తాం (పని - action word) కాబట్టి, మనం ముఖ్యంగా తెలుసుకుని గుర్తుంచుకోవాల్సిన విషయం: English verbs - 2types - 1) Be forms = (ఉండటం అనే అర్థం వచ్చేవి) 2) Action words (పనిని తెలిపేవి). 'Be' forms:a) Am, is are, was, were b) చివర 'be' వచ్చే, shall be, should be, will be, would be లాంటివి. c) చివర 'been' వచ్చే, have been, has been, had been, shall have been లాంటివి. Actions words: పనిని తెలిపే మాటలు: Take, give, read, go, come లాంటివి.
|
స్థూలంగా: 'be' forms మనం ఉండే స్థితిని చెబుతాయి. Action words మనం చేసే పనిని తెలుపుతాయి. మళ్లీ మళ్లీ చెబుతున్నాం - గుర్తుంచుకోండి. చూడండి. Sachin is a cricketer - ఇక్కడ verb: is (ఉన్నాడు) - సచిన్ క్రికెటర్ (గా ఉన్నాడు) - ఇది ఉండటాన్ని తెలిపేది కాబట్టి, is అనే 'be' form వస్తుంది. Sachin plays cricket - ఇక్కడ verb - plays = ఆడతాడు - పని. కాబట్టి ఇది actionword. ఇప్పుడు అన్ని 'be' forms అర్థం - వాటి ఉపయోగం చూద్దాం. కేవలం 'be' formsనే వాడి English లో 30 శాతం conversation(సంభాషణ) నడిపించవచ్చు.
| |
Am, is, are, was, were - ఈ 'be' forms గురించి ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా? ఇప్పుడివి చూడండి. Shall be/ will be - future states of being (ముందు కాలంలో ఉండటం) I shall be there tomorrow. (రేపు నేనక్కడ ఉంటాను.) |
He will be an Engineer soon. (అతడుత్వరలోనే ఇంజినీర్‌గా ఉంటాడు.) Modern English speech లోshall be వాడకం బాగా తగ్గిపోయింది. English వాళ్లు ఎక్కువగా will be ఉపయోగిస్తున్నారు. There will be elections next year. (వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉంటాయి.)
| |
ఈ lesson మొదట్లో ఇచ్చిన conversation లోని మాటలు చూద్దాం.
When will they be here again?
(వాళ్లు మళ్లీ ఇక్కడ ఎప్పుడుంటారు? (will be - be form)) Would be = గతంలోంచి భవిష్యత్‌లో ఉండే విషయం. a) I will be there tomorrow (నేను రేపక్కడ ఉంటాను.) b) I told them (వాళ్లతో గతంలో చెప్పాను) that I would be there (నేను అక్కడ ఉంటానని). Sentence (b)లో నేను చెప్పాను (గతంలో) అక్కడ ఉంటానని - ఇక్కడ would be = గతంలో అనుకునే భవిష్యత్ గురించి. Should be = must be = have to be/ has to be = ఉండాలి. You should be/ must be/ have to be at school by 10. |
(పదింటికల్లా నువ్వు schoolలో ఉండాలి.) She has to be at home by 8. (ఎనిమిదింటికల్లా ఆమె ఇంట్లో ఉండాలి.) ఇది గమనించండి: Have = has అయితే I, we, you and they (వాళ్లు/ అవి)తో have అంటాం. He, She, It తో has అంటాం.
| |
ఇప్పటి వరకూ మనం verb ను గురించి తెలుసుకున్న విషయాలు |
1) am/is/ are = ఉండటం, ఇప్పుడు/ ఎప్పుడూ/ మామూలుగా 2) Was/ were = గతంలో ఉండటం b) Shall be/ will be = భవిష్యత్ లో ఉండటం c) Would be - past future (గతం నుంచి భవిష్యత్ చెప్పేందుకు) d) Should be/ must be/ have to be/ has to be = ఉండాలి. |
ఇప్పుడు ఈ Exercise చేయండి:ఇవన్నీ 'be' forms కు సంబంధించినవే. pat the following English. 1) అతడు ప్రతిరోజు ఇక్కడ ఉదయం ఏడింటికి ఉంటాడు. 2) ఫస్ట్ షో ప్రతిరోజు 6.15కు | |
3) వాళ్లెప్పుడుంటారు school లో? 4) మీ class ఎప్పుడు (ప్రతిరోజూ)? 5) మీరు రేపు అక్కడ ఉంటారా? 6) వచ్చే జూన్‌కు మీ వయసెంత (ఉంటుంది)? 7) నిన్న వాళ్లిక్కడ ఉన్నారా? 8) అతడు వచ్చే సంవత్సరానికి 20 ఏళ్లవాడిగా ఉంటాడు 9) అతడు పదింటికి ఇక్కడ ఉండాలి. (గమనించండి - తెలుగుకూ English కూ ఉన్న తేడా: The book is on the table = పుస్తకం table మీద ఉంది. తెలుగులో Table తర్వాత 'మీద' వస్తోంది. కదా? English లో అది table ముందు, on (మీద) వస్తోంది కదా?) |
Answers:1) He is here at 7 every morning (Spoken English లో AM/ PM వాడం. Morning/ Evening etc అని అంటాం. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు వాటినీ వదిలేస్తాం.) * Our class is at 10 every day. సామాన్యంగా రాత్రి 10 గంటలకు తరగతులు ఉండవు కదా? అందుకే at 10 అంటే చాలు. 2) The first show is at 6.15 everyday. First, Second, Third etc ముందు, 'the' కచ్చితంగా వాడాలి 3) When are they at school? (Question కాబట్టి subject 'they' ముందు verb వస్తుంది.) 4) When is your class (every day)? ఇది కూడా question.5) Will you be there tomorrow? Question లో రెండు, మూడు మాటలున్న verb వాడాల్సి వస్తే - [ఇక్కడిలా will be] - verb లో మొదటి మాట ముందు తర్వాత subject వస్తాయి. 6) What will be your age/ What will your age be by next June?7) Were they here yesterday?8) He will be 20 (Years old) next year.9) He must be/ should be/ has to be here at 7.
LEARN THE SPOKEN ENGLISH PART VI
నిత్యజీవితంలోని సందర్భాల్లో తరచూ వాడే మాటలను Englishలో చూద్దాం.
|
Get up = నిద్ర లేవడం (wake up కాస్త పాండిత్యం). Brush (teeth) = పళ్లు తోముకోవడం Have a bath = స్నానం చేయడం Have breakfast/ lunch/ dinner/ coffee/ tea/ milk etc.
|
ఇలాంటి చోట్ల 'have' బదులు take కూడా వాడవచ్చు. కానీ వ్యవహారికంగా have better. రోజూ తీసుకునే Breakfast, lunch, dinner లాంటి వాటి ముందు 'a/ an, the' ఉపయోగించం.
| |
Get ready/ be ready = తయారవడం cook = వంట చేయడం అయితే ప్రత్యేకంగా breakfast, lunch, dinner లాంటివి లేదా ఏదైనా ప్రత్యేక వంటకం చేయడం లాంటి వాటికి make/ prepare పదాలను వాడతాం. Mom is making breakfast. We are preparing/ making some special dishes for our picnic. (పిక్నిక్ కోసం మేం ప్రత్యేకమైన వంటకాలు (తయారు) చేస్తున్నాం.) గమనించండి: మామూలుగా వంట చేయడం = cook, ఏదైనా ప్రత్యేకమైన వంటకాన్ని (dish) తయారు చేయడం 'make'/ 'prepare'.She is cooking = ఆమె వండుతోంది. She is making dinner = ఆమె రాత్రి భోజనానికి కావాల్సినవి వండుతోంది.
|
|
Dinner = రోజులో ముఖ్యమైన భోజనం - సామాన్యంగా ఇది మనకు రాత్రి భోజనం అవుతుంది. Lunch = మధ్యాహ్న భోజనం. Supper - English వాళ్లు రాత్రిపూట చేసే భోజనం - వాళ్లకు dinner సామాన్యంగా సాయంత్రం అయి పోతుంది. మళ్లీ రాత్రి ఎప్పుడయినా ఆకలేస్తే తినేది supper - ఇది రోజూ 'భోజనం'లా ఉండకపోవచ్చు - మామూలుగా 'ఫలహారం' ఉంటుంది. Chew = నమలడం; Swallow = మింగడం; Suck = 1) పీల్చడం 2) చప్పరించడం; |
Gulp = (ద్రవపదార్థాలను) గుక్కలో మింగడం; Throwout = వాంతి చేసుకోవడం (Vomit కాస్తlookish); Spit = ఉమ్మడం (PT and PP - Spat) Spittle = ఉమ్ము Tasty = రుచికరమైన. Sweat = చెమట/ చెమటోడ్చి పని చేయడం He is sweating = అతడికి చెమట పోస్తోంది. * I am sweating, please turn on the fan. నాకు చెమట పోస్తోంది, కాస్త ఫ్యాన్ వేయండి.
|
|
Prasad: How long have you been here? (ఎంతసేపటి నుంచి ఉన్నావిక్కడ/ ఉన్నావు నువ్వు?) Subhash: For about 15 minutes. (15 నిమిషాలుగా) Prasad: When were you here last? (కిందటిసారి ఎప్పుడున్నావిక్కడ?) Subhash: Last Sunday. (గత ఆదివారం.) Subhash: He has been my friend for the past five years. (అయిదేళ్లుగా అతడు నా స్నేహితుడు) Prasad: How? (ఎలా?) Subhash: I have been his room mate since 2005. (2005 నుంచి నేను తన room mate గా ఉన్నాను.) |
మనం ఇంతకు ముందు తెలుసుకున్నది: Was/ were = గతంలో ఉండటం am/ is/ are = ఇప్పుడు/ ఎప్పుడూ ఉండటం ఇప్పుడు పై సంభాషణలోని ఈ sentences ను చూడండి: 1) How long have you beenhere? Verb: Have been (Be form) |
|
2) He has been my friend for the past five years. Verb: Has been (Be form)3) I have been his room mate since 2005. Verb: have been ఇక్కడి Verbs: have been, has been. ఇవికూడా 'be' forms -అంటే ఉండటాన్ని తెలుపుతాయి. గతంలో ఉండటం - was/ were, ఇప్పుడు ఉండటం - am/ is/ are కదా? గతం నుంచి ఇప్పటివరకు ఉండటం/ ఇంకా ఉండటం = I/ we/ you/ they have been; He/ she/it has been. a) మేం నిన్న ఇక్కడ ఉన్నాం. (We were here yesterday.) మేం ఇప్పుడిక్కడ ఉన్నాం. (We are here) మేం నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం. (We have been here since yesterday.) Since = గతంలో ఒక సమయం నుంచి. Since yesterday = నిన్నటి నుంచి b) Tendulkar (he) was a cricketer in 1989 + Tendulkar (he) is a cricketer even now = Tendulkar (he) has been a cricketer since 1989. (టెండూల్కర్ 1989 నుంచి క్రికెటర్‌గా ఉన్నాడు.) * She was my classmate at school. (స్కూల్లో నాకామె classmate) + She is even now my classmate (ఇప్పుడు కూడా ఆమె నా classmate) = She has been my classmate since our school (స్కూల్ నుంచి ఇప్పటి వరకూ/ ఇంకా మేం classmates గా ఉన్నాం)= We have beenclassmates since our school (School నుంచి మేం classmates గా ఉన్నాం ఇప్పటివరకూ/ ఇంకా). for the past/ last = గత కొంతకాలంగా. Since 2005 = for the past/ last 5 years (2005 నుంచి) = (గత అయిదేళ్లుగా) * India has been independent since 1947 = India has been independent for the past 63 years. Since 1947 = 1947 నుంచి For the past 64 years = 64 ఏళ్లుగా ఈ since కు, for the past/ for the last కూ తేడా గుర్తుంచుకోండి. since = గతంలో ఒక సమయం నుంచి - ఒక సంవత్సరం నుంచి (since 2004), ఒక నెల నుంచి (since October), ఒక వారం/ రోజు నుంచి (since Monday/ Tuesday, etc) ఒక సమయం నుంచి (since 10 this morning), ఒక తేదీ నుంచి (since the 20th of lastmonth), etc. for ఎప్పుడూ ఒక విరామానికి. for the past last two years/ two months/ two hours/ ten min - utes etc.
|
Put the following in English (Exercise No. 2) Learn the following:
|
Raja Ram: నేను గత వారమంతా చెన్నైలో ఉన్నాను. Srinivas: నువ్వక్కడ ఎందుకున్నావు? Raja Ram: గత రెండు వారాలుగా కంపెనీ వ్యవహారాల (Company matters/ Company affairs) తో తీరిక లేకుండా (busy) ఉన్నాను. మా boss గత వారం చెన్నైలో ఉన్నాడు. అందుకే నేనూ అక్కడ ఉన్నాను.
| |
Srinivas: మా అబ్బాయి (My son) కూడా ఇప్పుడక్కడే ఉన్నాడు. గత మూడురోజులుగా అక్కడే ఉన్నాడు. Raja Ram: మళ్లీ ఎప్పుడు ఉంటాడిక్కడ? Srinivas: ఏదో తన business వ్యవహారాల (matters/ affairs) కు సంబంధించి అక్కడ ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులుంటాడు అక్కడే. Raja Ram: ఈ company లో అతడెంత కాలంగా ఉన్నాడు? (How long ? = ఎంత కాలంగా?) Srinivas: వచ్చేనెల మొదటి తేదీకి మూడేళ్లు అవుతుంది? How long? = ఎంతకాలం? How far? ఎంత దూరం? a) How far is your school from your home? (మీ ఇంటి నుంచి మీ బడి ఎంత దూరం?) b) How long will you be here? (నువ్విక్కడ ఎంతసేపు/ ఎంతకాలం ఉంటావు?) Learn the following words:
|
Anger = కోపం, Angry = కోపంగా ఉన్న love = ప్రేమ/ ప్రేమించడం; hate = dislike = ద్వేషించడం joy = సంతోషం = happiness: feel = భావించడం emotion = ఉద్రేకం/ ఆవేశం calm = ప్రశాంతత/ ప్రశాంతమైన |
|
pity = జాలి/ దయ kindness = దయ cruel = క్రూరమైన cruelty = క్రౌర్యం sympathy = సానుభూతి sympathetic = సానుభూతితో affection = ఆపేక్ష surprise = ఆశ్చర్యం/ ఆశ్చర్యపరచడం Sincere = చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా |
Try to use the words above in your own sentences:Some examples are given below. |
1) Anger is not a good quality. 2) Gandhi was never angry (Never = ఎప్పుడూ లేదు/ కాదు). 3) Students hate homework.4) Duryodhana had hatred for Pandavas = Duryodyana hated Pandavas.5) She dislikes him = అతడంటే ఆమెకిష్టం లేదు. 6) The news gave me joy/ happiness7) I feel happy = నేను సంతోషపడుతున్నాను. Try the rest of the words = మిగతావి మీరు ప్రయత్నిం
|
|
|
|
|
|
|
No comments:
Post a Comment