KAVALIPOST

Thursday, 28 March 2013

LEARN THE ENGLISH GRAMMAR PAPER 1

--------------------------------------------------------

Grammar అంటే తెలుసు కదావాక్యనిర్మాణంమాటల వాడకం లాంటివాటికి సంబంధించిందిEnglish లో తప్పులు లేకుండా మాట్లాడాలన్నా,రాయాలన్నా grammar తెలుసుకోవడం అవసరం. అయితే grammar తెలిసినంత మాత్రాన, grammar నిబంధనలన్నీ అంత బాగా గుర్తుండకపోవచ్చు.అందుకే మన భాష తప్పులు లేకుండా ఉంటుందనుకోవడానికి వీల్లేదుGrammar తెలుసుకోవడంతోపాటు రాయడం, మాట్లాడటం regular గా practice చేయడం చాలా ముఖ్యం. మాట్లాడటంరాయడంచదవడం లాంటివి సాధనచేయకపోతే ఫలితం ఉండదు.         ఈ grammar అందివ్వడంలో ముఖ్యోద్దేశాలు రెండు. మొదటిది, అన్నింటి కంటే ముఖ్యమైందీ, మీరు correct గా మాట్లాడగలిగేందుకు, రాయగలిగేందుకు సహాయపడటం. రెండోది - ఇప్పుడు అన్ని తరగతుల, పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు grammar కే ఉంటున్నాయి. కాబట్టి వాటిని మీ సొంతం చేసుకునేందుకు చేయూతను అందించడం.
        ఈ grammar lessons చదివి, అర్థం చేసుకుని practice
 చేస్తే 
మీరు చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతారు. తప్పులు లేకుండా రాయగలిగిన సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. 
1. Sentence: A group of words with complete meaning.

1) New Delhi is the capital of India

     
(ఇండియా రాజధాని ఢిల్లీ
)
     
ఇది పూర్తి అర్థాన్నిచ్చే మాటలసమూహంకాబట్టి ఇది
 sentence.
2) What are you doing?

     
(నువ్వేం చేస్తున్నావు
?)
     ఇది కూడా పూర్తి అర్థాన్నిచ్చే group of words కాబట్టిఇది sentenceఅవుతుంది.
3) Read the lesson (
పాఠం చదువు
), and
4) How tall he is! (
అతనెంత పొడుగ్గా ఉన్నాడో!) కూడా sentences. 

      ప్రతి sentence ఏదో ఒక దాన్ని గురించి చెబుతుంటుంది కదాఅది sentence కు subject అవుతుందిFor example, sentence (1), New Delhi ని గురించి చెబుతోందికాబట్టి New Delhisentence (1) కు subject.అలాగే sentence (2) కు subject, 'you', sentence (4) కి 'he' subjectఅవుతాయి
.
      sentence (3), Read the lesson = You read the lesson.. 
ఇక్కడ -you subject అవుతుందిఅయితే ఇలాంటి sentences లో you మామూలుగావాడం
మనం ఇంత వరకు తెలుసుకున్నది:
       Sentence 
దేన్ని గురించి చెబుతోందోఅది దాని subject అవుతుంది.ఇదెప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. Sentences లో కూడా రకాలుఉంటాయి
.
1. ఏదైనా ఒక విషయాన్ని తెలిపేది.
e.g.: 
a) He comes here in the evenings.
              (అతడు ఇక్కడికి సాయంత్రం పూట వస్తాడు.)
b) I Know English.
    (నాకు ఇంగ్లిష్ తెలుసు.)
    ఇలాంటి sentences, statements ను assertive sentences అని కూడా అంటారు.
(state = చెప్పడం)
2. రెండోరకం sentences, ప్రశ్నలు (questions).
a) Where is he?
    
(అతడెక్కడ? )
b) What is your name?
  ఇలాంటి questions ను interrogative sentences అని కూడా అంటారు.
    ( Interrogate = ప్రశ్నించడం). 

3.
 ఇక మూడోరకం sentences, imperative sentencesఅంటే ఇవి ఆజ్ఞలను,అభ్యర్థనలను (order & requests) తెలుపుతాయి.
    (you) sit down     {(నువ్వుకూర్చో}.
    (you) Please come in
    (లోపలికి రండి - అభ్యర్థన).
     ఈ imperative sentences అన్నింటికి subject మామూలుగా 'you'ఒక్కోసారి అంటాంమామూలుగా వదిలేస్తాం ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి
¤  ¤  ¤  ¤  ¤  ¤


ఒక స్కూల్లో ఉన్న విద్యార్థులంతా ఏదో ఒకclass వాళ్లై ఉంటారు కదాఅలాగే English లో ప్రతిమాటా ఏదో ఒక part of speech(భాషా భాగం)గా ఉంటుంది.
English లో eight parts of speechఉన్నాయి.
అవి
1. Noun
2. Pronoun
3. Adjective
 
4. Verb
5. Adverb
6. Conjunction
7. Preposition
8. Interjection
.
 
NOUNS:
Noun means a name.

మనుషులుజంతువులుప్రదేశాలువస్తువులు ఇలా దేనికైనా మనం ఇచ్చేపేర్లను'Nouns' అంటారు.

       పై nouns అన్నీ ఒక్కొక్క పేరుతోనే ఏర్పడేవిఅంటే ఇవి Simple nouns.కొన్నిసార్లురెండు మూడు మాటల కలయికతో కూడా nouns ఏర్పడతాయి.
అవి Compound nouns
e.g: Shoe + lace = shoelace
         foot + ball = football

     ఇవేకాకుండా nouns లో మూడో తెగ derivative nouns. కొన్ని సందర్భాల్లోఒక noun కు ఇంకో శబ్దం చేర్చడం వల్ల ఏర్పడేదే derivative noun.

IMPORTANT: Nouns లో రెండు రకాలుంటాయి.
1) Countables: ఇన్ని,అన్ని అని సంఖ్యలోచెప్పేవాటిని countablesఅంటాంఅంటే వీటిని మనం1, 2, 3 అనిలెక్కించవచ్చు
 

e.g.: One pen, two pens, five pens అంటాం కదా - కాబట్టి pen, countable... అలాగే మరికొన్ని countables: Book, tablestudent, teacher, man, woman, child etc ఇవన్నీ countables.
2) Uncountables - మనంలెక్కపెట్టలేనివి.
     e.g.: Sugar, milk, rice etc. వీటిని మనం సంఖ్యల్లోచెప్పంఅంటే లెక్కించం -కాబట్టి ఇవి uncountables.
Some more examples of uncountables: air, oil, coffee, tea etc.
 


uncountables Plural ఉండదు. Milk, sugar, rice లాంటివి Plural లో (2 milks, 3 sugars అని) చెప్పకూడదు.
3. Countable singulars కు ముందు కచ్చితంగా a/an వాడాల్సిందే.
      A book gives information (Book countable singular కాబట్టి, దాని ముందు 'A' వాడాం.) అలాగే An Umbrella is useful in rain (ఇక్కడ umbrella, countable singular. కాబట్టి దానిముందు an
 వాడాం).
(A/an = ఒక.)
      పైన చెప్పుకున్న వాక్యానికి తెలుగు అర్థం - గొడుగు వర్షంలో ఉపయోగపడుతుంది.
      అంతేకానీ ఒక గొడుగు వర్షంలో ఉపయోగపడుతుందని 
అనం.
      కానీ English లో ఇది చాలా ముఖ్యం - countable singular ముందు a/an వాడటం అనేది.
      అయితే ఎప్పుడు 'a' వాడాలి? ఎక్కడ 'an' వాడాలి
?
      తెలుగు శబ్దాలు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ తో ప్రారంభమయ్యే English మాటల ముందు An వాడతాం.
      మిగతా వాటిముందు, '
A' ను ఉపయోగిస్తాం.
      చూడండి: An ant, An aunt, An egg, An idea, An ox (ఎద్దు), An owl (గుడ్లగూబ), An Umbrella, An honour (ఆన(ర్) = సన్మానం/పురస్కారం), An hour (అవ(ర్)).
      University కి ముందు ఏం వాడతాం. A University అనే అంటాం; university = యూనివ(ర్)సిటీ- అ నుంచి ఔ వరకు ఉండే శబ్దాల్లో, యూ లేదు కదా? అందుకని A University అనడం correct. అందుకే ఈ అంశాలు గుర్తుంచుకుందాం.
4. Uncountables: వీటికి plural ఉండదు. milks, sugars, rices అనం కదా? ఈ కిందివి గుర్తుంచుకోండి. 

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు: 
 noun అయినా Uncountable అయితే - 1) దానికిplural ఉండదు.
 2) 
దాని ముందు a/an రాదు
.
      
అయితే అన్ని భాషల్లో లానే English లో కూడా రెండుఅర్థాలుండే మాటలు చాలా ఉన్నాయిఅలాంటప్పుడు ఒకేnoun, ఒక అర్థంతో countable కావచ్చుఇంకో అర్థంతోuncountable కావచ్చు
 



     ఒక మాట ఎప్పుడు countable, ఎప్పుడు uncountable అనే విషయంలో కాస్త జాగ్రత్తగాఉండాలి.
I bought iron yesterday.
      
ఇక్కడ iron ముందు 'an' లేదుకాబట్టి అర్థంనేను నిన్న ఇనుము కొన్నానుఅని
.
I bought an iron yesterday.
      Iron 
ముందు, an ఉంది కదాఅంటే ఇక్కడ iron countable. కాబట్టి అర్థం,ఇస్త్రీపెట్టె.


LEARN THE ENGLISH GRAMMAR PAPER II


  కొన్ని nouns కు ఉండే అర్థాలను బట్టి, ఒక అర్థంతో countable కావచ్చు, ఇంకో అర్థంతో uncountable గా ఉండొచ్చు. మరికొన్ని అంశాలను చూద్దాం.
Countables ను Plural గా మార్చేందుకు కింది అంశాలు గుర్తుంచుకోవాలి.
1. చివర -s, -x, -sh -ch, -tch లేని nouns కు, 's' చేర్చి Plural చేయవచ్చు.

2. చివర ch, o, s, sh, tch, z అక్షరాలు వచ్చే nouns కు, 'es' చేర్చి Pluralచేస్తాం.  
3. చివర y వచ్చే చాలా nouns ను Plural చేయాలంటే y తీసేసి, -ies చేరుస్తాం. 
అయితే y ముందు, a, e, o, u వస్తే మాత్రం y తర్వాత 's' చేరిస్తే సరిపోతుంది.
        Toy (Singular)       Toys (Plural)
4. 'f', 'fe' చివరవచ్చే కొన్ని nouns ను Plural గా మార్చేందుకు, 'f', 'fe' తీసేసి 'ves' చేరుస్తాం. 

అయితే, handkerchief, roof లాంటి nouns కు ఇది వర్తించదు. వాటికి 's' చేరిస్తే Plural అవుతాయి.
5. కొన్ని nouns కు Plural form నిర్ణీత సూత్రం ప్రకారం  వస్తుందని చెప్పలేం.
6. Singular, Plural ఒకేలా ఉండేవి కొన్ని
UNCOUNTABLES (లెక్క పెట్టలేనివాటికి)1. Plural number ఉండదు.
2. వాటిముందు a/an వాడం.
     ఇది కిందటి lesson లో తెలుసుకున్నాం కదా. అయితే English లో మనం countable అనుకునేవి కొన్ని uncountable. అంటే వాటిని Plural లో వాడం, వాటిముందు 'a'/ 'an' రాదు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.
గమనించండి: A lot of = చాలా. -ఇది Countables ముందూ వాడొచ్చు, uncountables ముందూవాడొచ్చు. 
A lot of books (countable) = చాలా పుస్తకాలు;
A lot of sugar = చాలా/ఎక్కువ పంచదార(uncountable)
అలాగే some = కొన్ని (countable) /కొద్ది, కొంచెం, కొంత (uncountable)
some books (countable) = కొన్ని పుస్తకాలు
some milk = కొన్ని పాలు.
అంటే A lot of, some ను countables, uncountables లకు రెండింటికీ వాడతాం.
English లో కిందివన్నీUNCOUNTABLE. అంటే వాటిముందు a/ an వాడం, వాటికి Plurals ఉండవు. గుర్తుంచుకోండి. ఇది ముఖ్యమైన విషయం.
మరో విషయం: Uncountables ముందు a piece of/ pieces of వాడొచ్చు.
     Advice (సలహా) - Advises లేదు.
     an advice, a good advice ఇవన్నీ సరికాదు.
i) He gave me advice (  )
ii) I had a lot of advicesome advice from him.
 ()iii) Let me give you a piece of advice/ a few pieces of advice. ()
      అలాగే ఈ కిందివన్నీ Englishలో Uncountable.
¤ Bread (a piece of/ pieces of bread అంటాం. Breads మాత్రం కాదు). మనం Bread ను Bakery లో loaf/ loaves గా కొంటాం, పాలను litre/ litres లో కొన్నట్లు. అలాగే మనం తినేటప్పుడు a slice of bread/ slices of bread లో చెబుతాం. (slice = ముక్క)
 
¤ Milk తాగడాన్ని a glass of milk/ glasses of milk లో చెప్పినట్లుఇలాఅంటాం కదా?
I had milk/ a glass of milk/ two glasses of milk (ఎక్కడా milksఅనంఅలాగే breads అనం.
 
¤  Business (పని) - ఇదీ Uncountable.
My father has gone out on business
(మా నాన్న పని మీద బయటికెళ్లారు.)
తెలుగులో ఒక పనిమీద అన్నట్లు a business' అని గానీ, 2, 3, పనులు అన్నట్లు two or three businesses అని గానీ అనకూడదు.
I have business; let me go
(నాకు పనుంది. నన్ను వెళ్లనీ) (A business అనం)
¤ Furniture (Table, Chairలాంటివిఇది కూడా Uncountable.అంటే A furniture/ furnitures అని ఉపయోగించకూడదు. 
Kumar bought furniture/ some (
కొంత) furniture/ a lot of (చాలా) furniture yesterday. ఎక్కడా a furniture/ furnituresఅనలేదు కదా?
 
అయితే a piece of/ pieces of/ an item of/items of furniture అంటాం. There are three itemspieces of furniture in the room
(ఆ గదిలో 3 వస్తువులు furniture ఉన్నాయి). Furnitures అనకపోవడం గమనించండి.
 

¤ Luggage (సామాను) కూడా అంతే.
A luggage/ luggages అని వాడకూడదు. a piece of/ an item of/ pieces of/ items of luggage అనాలి
.
The old woman had three pieces of luggage.
 
¤ Hair = వెంట్రుకచాలావరకు దీన్ని Uncountable గానే వాడతాంఎప్పుడైనా there is a hair in the riceఅనవచ్చుకానీ మామూలుగా అయితే, hairs అనేది ఎప్పుడూ వాడంముఖ్యంగా మనుషులజుట్టు అనే అర్థంతో. 
She has beautiful dark hair అంటాం. hairs అనం.
¤ Information (
సమాచారం
) - Uncountable.
A piece of/ pieces of information 
అనొచ్చు
.
An Information / informations 
సరైన వాడుక కాదు
.
I have information/ a piece of information for you- correct.
I want some conformation/This book gives a lot of information-
ఇవన్నీ
 correct.
An information/informations 
తప్పు.

¤ News = వార్త /సందేశం- uncountable.
A news/These news సరికాదు, a good news, a happy news కూడాతప్పే.
He has got news for us/some news for us/a lot of news for us - all these are correct.
A good news/An important news - ఇవన్నీ తప్పే.
¤
 Paper - రాయడానికి, Printing కూ వాడేది uncountable. అంటే రాసేప్రింట్ కు వాడేpaper విషయంలో A paper/papers అనం. A sheet of/ a slip of/ a piece of paper- all these are correct.
a) He needs two sheets of paper.
b) She wrote down her name on a slip of paper - correct.
c) Here is a piece of paper - correct.
I want paper - correct
The shop sells paper - correct (not papers)
¤   అయితే paper అంటే పత్రం (ముఖ్యమైన కాగితం - certificates, passport, visa, ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల లాంటివి) అనే అర్థంతో వాడితే అప్పుడది countable.
Show me your papers.
మీ పత్రాలను (certificates, documents లాంటివి) చూపించండి.
Here is a paper showing my right to the property.
ఆస్తి మీద నాకున్న హక్కును తెలిపే ఒక పత్రం ఇది.
¤ Soap (సబ్బు) - uncountable.
అంటే A soap/soaps తప్పు.
i) A cake of/cakes of soap (Shop లో కొనేటప్పుడు)
I went to the shop for soap/a cake of soap - (correct)We use three cakes of soap a month
 
(నెలకు మూడు సబ్బులు వాడతాం - Soaps కాదు)
Let me have soap/some soap/a piece of soap, please
(నాకు సబ్బు ఇవ్వండి - A soap అనం.)
 
¤  Work = పని.
A work/an urgent/an important work - wrong.
తెలుగులో ఒక పని, చాలా పనులు అంటాం. English లో అది సరికాదు. Works కూడా తప్పు.
A piece of work - correct.
He has important work - correct
అయితే work అంటే పని అనే అర్థంతో Job వాడతాం. (Job కు ఇంకో అర్థం,ఉద్యోగం)
Work = Job.
Work  uncountable, job countable.
I have two or three jobs to do before going to bed.
(పడుకోవడానికి ముందు రెండు మూడు పనులు ఉన్నాయి నాకు) - correct.
ఇలా ఇవన్నీ కూడా uncountables. అంటే వీటికి plural ఉండదువీటిముందు a/an రాదుఅయితే చాలా/ఎక్కువ అనే అర్థంతో a lot of;  కొన్ని,కొంత అనే అర్థంతో some, వీటి ముందు వాడొచ్చు. A piece of/pieces of అనికూడా వీటిముందు వాడవచ్చు .
మరికొన్ని Nouns ను ఎప్పుడు plural లోనే వాడతాం.అవి ఒక వస్తువునే సూచించినప్పటికీ:
e.g.: 1) Trousers/Pants (పురుషులు ధరించేవి) (Pantsఅనే అనాలిఒక వస్తువు అయినా. Pant అనడం తప్పుఅయితేఒకటి కంటే ఎక్కువ Pants ను చెప్పాలనుకున్నప్పుడు
 
 LEARN THE  ENGLISH GRAMMAR PAPER III

మరికొన్ని Nouns కు Singular, Plural ఒకే రూపంలో ఉంటాయి. అంటే ఒకే మాటను Singular లోనూ, Plural లోనూ వాడతాం. అవి :
1. Aircraft = విమానం (Singular)/ విమానాలు (Plural)        a) An aircraft (ఒక విమానం - Singular) is launching here tomorrow(ఒక విమానం రేపు ఇక్కడ దిగుతోంది).
        b) These aircraft
(విమానాలు - Plural) aremade in India.
 (ఈ విమానాలు భారత్‌లో తయారయ్యాయి). 
2. Deer = జింక (Singular)/ జింకలు (Plural)        a) A deer (ఒక జింక - Singular) is under the tree. (చెట్టు కిందఉంది).
        b) Some deer
 (కొన్ని జింకలు - Plural) are by the lake.
 (ఆ సరస్సు దగ్గర ఉన్నాయి).
3) Fish =
 చేప ((Singular)/ చేపలు (
Plural)        a) A fish (ఒక చేప - Singular) is caught in the net. (వలలో చిక్కింది).
        b) Some fish
 (కొన్ని చేపలు - Plural) are very tasty.
 (చాలా రుచిగా ఉంటాయి).
గమనిక: Science
 లో రకరకాల చేపలు అనే అర్థంలో 'Fishes' Plural
 గా వాడతారు.
4) Means =
 మార్గం (పద్ధతి, సాధనం) (Singular)/ మార్గాలు (పద్ధతులు, సాధనాలు) (
Plural)        a) The means he followed (అతడు అవలంబించిన పద్ధతి/ మార్గం - Singular) is bad (చెడ్డది).
        b) There are many means (చాలా మార్గాలున్నాయి - Plural) of earning money.

             (డబ్బు సంపాదించడానికి).

5) Offspring =
 సంతతి (ఒకరు - Singular), సంతతికి చెందినవి/ చెందినవారు - (Plural).        a) The human (మనిషి - Singular) is the offspring of the monkey. (వానర సంతతికి చెందిన ప్రాణి).
        b) The Kowravas
 (కౌరవులు - Plural) are the offspring of Dhrutarashtra. (ధృతరాష్ట్రుడి సంతతివారు - 
Plural).6) Species = జంతు, వృక్షజాతి (Singular)/ జంతు, వృక్షజాతులు (Plural)        a) This species of fish (ఈ జాతి (Singular) చేపలు) is rare (అరుదు).
        b) Many species of fish (Plural) are found in the sea.
 (చాలా జాతుల చేపలు సముద్రంలో దొరుకుతాయి).
7) Series =
 వరుసక్రమం (Singular)/ వరుసక్రమాలు (
Plural)        a) This attack (ఈ దాడి) is the first of a series (ఒక వరస - Singular) of attacks on Indians.        b) He has played four or five test series (నాలుగైదు test matches series - Plural) for India.8) Sheep = గొర్రె (Singular) / గొర్రెలు (Plural)        a) A sheep (ఒక గొర్రె - Singular) follows its herd (తన మందను అనుసరించి వెళ్తుంది).
        b) Sheep
 (గొర్రెలు - Plural) are reared (పెంచుతారు) both for their meat and wool.
 (వాటి మాంసం, ఉన్ని కోసం).
9) Swine -
 అసలు అర్థం - పంది (Singular)/ పందులు (Plural) - అయితే దీన్ని ఎప్పుడూ తిట్టేందుకు/ science పరిభాషలో (ఉదాహరణకు - swineflue
) వాడతారు.
        a) He is behaving like a swine =
 అతడు ఓ పందిలా (Singular
) ప్రవర్తిస్తున్నాడు.
        b) These swine need to be sent out =
 ఈ పందులను (మనుషులను తిడుతూ) బయటికి పంపాలి.
Sailaja: Where is the book I gave you yesterday?
 (నేను నిన్న నీకిచ్చిన పుస్తకం ఏది?)
Sashi: You mean that new edition of the Bhagavadgita?
 (నువ్వనేది భగవద్గీత కొత్త సంకలనం గురించా?)
Sailaja: Exactly
 (సరిగ్గా అదే). Sashi: Oh, it is on the table there. I like its cover very much, especially the back cover.            It shows a beautiful picture of the Himalayas, and the Ganga. (అది ఆ table మీద ఉంది. దాని అట్ట బాగా నచ్చింది నాకు, ముఖ్యంగా వెనక అట్ట - అది హిమాలయాలను, గంగను చూపిస్తోంది).
Sailaja: It is my brother's. He bought it in the US. (అది మా అన్నయ్య America లో కొన్నాడు).
Sashi: When did he go there? Wasn't he in the Netherlands (Holland) for some time?
 (ఆయన అక్కడికెప్పుడు వెళ్లాడు. నెదర్లాండ్స్‌లో ఉండేవారు కదా?)
Sashi: What do you think? I feel that of the two, The US is the better country to live 
in. The longer you live in India, the sadder you
            are because of the corruption here
. (నీవేమనుకుంటున్నావు? రెండింటిలో అమెరికా మెరుగని నేననుకుంటున్నా. భారత్‌లో ఎంత ఎక్కువ ఉంటే అంత నిరాశగా ఉంటుంది, ఇక్కడి అవినీతి వల్ల).
Sailaja: Perhaps you are right. Even Mr. Singh, PM of India doesn't seem to be much worried about the corruption his government.

             (నువ్వనేది సరైందేనేమో. ప్రధాని సింగ్ కూడా తన ప్రభుత్వం అవినీతి గురించి అంతగా ఆదుర్దా పడుతున్నట్లు అనిపించడంలేదు).
Sashi: Perhaps the average Indian has no hope of a clean India in the near future.
 (బహుశా సగటు భారతీయుడికి, పరిశుద్ధమైన భారత్‌ను గురించిన ఆశలు ఇప్పుడిప్పుడే లేవేమో).
Sailaja: I'm afraid, no.
 (లేనట్లేనని నా భయం). Look at the following expressions from the conversation above:      1) The book I gave you yesterday.      2) The Bhagavadgita.      3) It's on the table there.      4) ... picture of the Himalayas and the Ganga.      5) I bought it in the US.      6) He used to be in the Netherlands.           ఇంతకు ముందు 'a'/' an' ఎక్కడ వాడాలో చూశాం కదా? ఇప్పుడు పై conversation (సంభాషణ) గమనించండి. 'The' వాడే కొన్ని సందర్భాలు (Occasions) తెలుస్తాయి.
           'A'/ 'An' and 'The'లకు English లో చాలా ప్రాముఖ్యం ఉంది. ఇవి వాడాల్సిన చోట వాడకపోయినా వాడకూడని చోట వాడినా అర్థాల్లో చాలా తేడాలు వస్తాయి. కాబట్టి We should learn to use 
them properly
.1) The book I gave you yesterday = నిన్న నేను నీకిచ్చిన పుస్తకం. Observe the difference between:a) A book gives information = పుస్తకం (ఏ పుస్తకమైనా అనే అర్థంతో) సమాచారాన్నిస్తుంది. ఇక్కడ A = any/one = ఏదైనా/ఒక.
b) The book I gave you yesterday = ఇక్కడ, మనం 'ఏదో/ ఏ పుస్తకమో అని కాకుండా ఫలానా పుస్తకం - నేను నీకు ఇచ్చిన పుస్తకం - గురించి మాట్లాడుతున్నాం. అలాంటి అర్థం వచ్చేందుకు, 'The 
book' 
అంటాం. An egg is on the plate. The egg (on the plate) is for Ramesh.              In the first sentence, we are talking about, one egg. So we say an egg. In the second, మనం అంతకు ముందే మాట్లాడిన egg గురించి చెబుతున్నాం కాబట్టి, the eggఅంటాం. ఇది 'the' ముఖ్యమైన ఉపయోగం.
              The pen you presented me is very nice =
 నువ్వు నాకు బహూకరించిన పెన్ను చాలా బాగుంది.
గమనిక: 'A'/'An' లేదా, 'The' ఏది వాడాలి అని సందేహం ఉంటే, 'ఏ? ('Which'?) అని ప్రశ్న వేసుకుందాం. దానికి 'ఫలానా అని జవాబుంటే, 'the'
వాడాలి.
              లేకుంటే 'a'/'an'
 వాడాలి.
Man is standing there (అక్కడో మనిషి నిలబడి ఉన్నాడు).
Question వేసుకుందాం; Which man is standing there? (ఏ మనిషి నిలుచుని ఉన్నాడు అక్కడ?) - దీనికి సమాధానం లేదు, కాబట్టి ఇక్కడ Man
ముందు 'A' నే వాడతాం. A man is standing thereMan with the gun is James Bond. (తుపాకితో ఉన్న మనిషి జేమ్స్ బాండ్)- Question వేయండి: ఏ మనిషి James Bond? (Which man s James Bond?) Answer (Man with the gun) ఉంది కాబట్టి, The man with the gun is Bond.

ఇది అర్థం చేసుకుంటే, 'a'/'an', 'The' ఉపయోగించడం చాలా తేలిక. Look at some of the other expressions from the conversation above:a) It shows a beautiful picture of the Himalayas and the Ganga.b) He bought it in the USc) Wasn't he in the Netherlands?                 పై sentence అన్నీ 'the' వాడాల్సిన మరికొన్ని సందర్భాలను తెలుపుతాయి:
1) The Bhagavadgita, a great and holy book. అంటే గొప్ప, పవిత్రమైన గ్రంథాల ముందు 'the' తప్పక వాడాలి.
    
The Ramayanam, The Mahabharatam, The Bible, The Khuran etc.,2) The US - కొన్ని రాష్ట్రాలు కలిపి ఏర్పాటైన దేశాల పేర్లముందు, తప్పకుండా The రావాలి. The US/ USA (The United States of America),
     The UAE (The United Arab Emirates) etc.
          అయితే ఒక సందేహం రావచ్చు: India లో కూడా రాష్ట్రాలున్నాయి కదా? అయినా The India
 అనం, ఎందుకనే అనుమానం రావచ్చు. ఇక్కడొకటి గమనించాలి- భారతదేశం రాష్ట్రాలు ఏర్పడక ముందే ఉంది. దేశాన్ని రాష్ట్రాలుగా విభజించారు.
         America (The US/USA), the UAE (Gulf countries) విషయంలో రాష్ట్రాలు మొదట ఏర్పడి, అవన్నీ కలిసి దేశమయ్యాయి. అందుకని The USA/ US, The UAE 
అంటారు.
3) The Netherlands: ద్వీపాల సమూహం పేరు ముందూ, The
 వాడాలి.
        a) The Andamans (అండమాన్ దీవుల సమూహం), b) The Maldives (మాల్దీవులు) etc. అయితే ఒకే ఒక ద్వీపం పేరు ముందు, 'The'
 వాడకూడదు.
            The Srilanka (Wrong), because it is only one island - Srilanka (Correct).

4) The Himalayas - Use 'the' before the names of mountain ranges (పర్వత శ్రేణులు - కొన్ని పర్వతాలు కలిసి ఏర్పడేవి).
                The Vindhyas
 (వింధ్య పర్వతాలు),
                The Eastern Ghats
 (తూర్పు కనుమలు),
                The Aravalis (ఆరావళి పర్వతాలు) - ఈ పర్వత పంక్తుల పేర్ల ముందు "The" వాడాల్సిందే. అయితే ఒకే ఒక పర్వతం పేరు ముందు 'The'
 వాడం.
               The Mt. Everest - Wrong, because Everest is the name of just one mountain. So it is wrong to say, the Kanchanganga, The Dhavalgiri, as they are the names of single 
mountains.5) .... India is the best.           'Best' ముందు, 'the' వాడటం గమనించండి.
     తెలుసు కదా, ''best', superlative degree of 'good'. అంటే మనం ఎక్కడ superlative degree వాడినా, దానికి ముందు, 'the
' వాడాల్సిందే.
e.g.: a) He is the tallest boy in the class
 (అందరిలో పొడుగు).
b) AP is the biggest (Superlative degree, So, 'the' before 'biggest') State in South India. 'the' గురించి మరికొన్ని వివరాలు, next lesson లో.
LEARN THE ENGLISH GRAMMAR PART IV

Gunavanth is the taller of the two = ఆ ఇద్దరిలో గుణవంతే పొడుగు. Tall కు comparative degree 'taller'. అంటే ఇక్కడ comparative కు ముందు 'the' వాడాం.  ఇక్కడ పోలిక ఇద్దరి మధ్యే (of the two).ii) Comparative degree "taller" తర్వాత than లేదు. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే, comparative ముందు "the" వాడాలి. 
ఇద్దరి కంటే/రెండిటి కంటే ఎక్కువమంది/ వాటిని పోల్చినప్పుడు, Comparative తర్వాత "than"వచ్చినప్పుడు, ముందు "the" రాదు.
A) Of the two States, AP and TamilNadu (రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో) 
the former (ముందు చెప్పింది-AP) is the bigger(పెద్దది
).
Former కూడా comparative degree నే, 
Superlative - Foremost Former (Comparative of "fore") తర్వాత లేదా Bigger (Comparative of big) తర్వాత "than" లేకపోవడం గమనించండి. అందుకే వాటి ముందు "the" వాడాం
Some more examples of "the" before comparative degree not followed by "than".A) Prabat is the elder of the brothers (అంటే ఇక్కడ brothers ఇద్దరే. Elder తర్వాత "than" లేదు).
B) OF/ Between Ishant and Yuvraj, Ishant is the taller.
7) ఇంకా, కొన్ని రాష్ట్రాలు కలిసి ఏర్పడిన దేశాల పేర్ల ముందు "the"వాడతాం.
The USA (The United States Of America) -
మనం మామూలుగా (అమెరికా/ The States
 అంటాం. - ఇది కొన్ని రాష్ట్రాలు కలిసి ఏర్పడిన దేశం) TheUAE (The United Arab Emirates- మనం మామూలుగా దుబాయ్ అంటాం), ఇంకా The USSR(గతంలో సోవియట్ రష్యా, ఇతర దేశాల సమాఖ్య
).
అయితే ఇండియా కూడా కొన్ని రాష్ట్రాల సమూహమే కదా? మరి India ముందు "the" ఎందుకు
 వాడం
?
        ఎందుకంటే India మొదటి నుంచి ఒకే దేశం, దాన్ని మనం రాష్ట్రాలుగా విభజించుకున్నాం. కాబట్టి 
The 
India అనరు
.
8) "The" is used before designations and offices, హోదాల (designations) ముందు, Offices 
(పదవుల) ముందు, the వాడతాం. (Office అంటే కార్యాలయం కూడా ?)
The District Collector, The Mandal Revenue Officer (The MRO) etc.,
 ఇవన్నీdesignations. 
Also The principal, The Vice - Chancellor etc.The President of India, The Chief Minister, The MLA, The MP etc., ఇవన్నీ పదవులు (Offices).A) The Governor of AP, Mr. Narasimhan.B) The Principal of our college, Dr. Sudhakar etc.
         
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పదవి/ హోదా ముందు, తర్వాత వ్యక్తి పేరు వస్తే, ఆ పదవి/ హోదా ముందు "The" వస్తుంది. కానీ వ్యక్తి పేరు ముందూ, పదవి/ హోదా తర్వాత వస్తే, వాటి ముందు "The" రాదు. e.g: a) The Prime Minister of India, Mr. Manmohan Singh = Mr.Manmohan Singh, Prime Minister of India.       b) The Governor of AP Mr. Narasimhan = Mr. Narasimhan, Governor of AP.  వ్యక్తి పేరు తర్వాత పదవి పేరు  వస్తే, "the" లేకపోవడం గమనించండి.
9) ఇది గమనించండి
:
Meena: Prajwal, Have you seenthe Taj (తాజ్‌మహల్ చూశావా?) Prajwal: Unfortunately no, but I have seen the Kutubminar in Delhi. I have visited
                the Ajantha caves too. (దురదృష్టం, నేను చూడలేదు. అయితే కుతుబ్‌మీనార్, అజంతా

                గుహలు చూశాను
.)
Meena: The Rashtrapathi Bhvan in Delhi? (ఢిల్లీలో రాష్ట్రపతిభవన్?)
Prajwal: I've seen that too (అదీ చూశాను
)
            Tajmahal, Kutubminar- ఇవి జ్ఞాపక చిహ్నాలు (Monuments); రాష్ట్రపతి భవన్ - ఇది గొప్ప
, ప్రసిద్ధికెక్కిన భవనం - వీటిముందూ "The" రావాలి.
Hundred meters from here, you find the passport office. The rail station is just a kilometre from there. You'd (you had) better take an auto. (ఇక్కడ నుంచి రెండు మూడు వందల మీటర్ల దూరంలో Passport office ఉంది. అక్కడ నుంచి రైల్వేస్టేషన్‌కి కిలోమీటర్ ఉంటుంది. ఆటోలో వెళ్లడం మంచిది.)           రైల్వేస్టేషన్, పాస్‌పోర్ట్ ఆఫీస్ లాంటివి మనకూ మనతో మాట్లాడే వాళ్లకు తెలిసిన ప్రదేశాలు.వాటి ముందు పై సంభాషణలోలా 'The' వాడటం తప్పనిసరి. అలాగే The collectors office, Thepolice station, The post office, The Govt. General Hospital etc.Prasad: Who is the boy that got the first prize? (మొదటి బహుమతి పొందిన అబ్బాయిఎవరు?)
Prakash: Look there. He is the third in the row of boys there. (అక్కడ చూడు, ఆ పిల్లల 
వరసలో మూడోవాడు
).
        చూశారా? First, Second, Third, Tenth, Fifteenth etc - అంటే ఎన్నోది అని చెప్పేవాటి
ముందు కూడా 'The' వస్తుంది.
a) Jawaharlal Nehru was the first Prime Minister of India.
b) This is the 15th day of themonth. (ఇది నెలలో 15వ రోజు).
Sundar: When do you go for a walk worthy? (నువ్వు మామూలుగా walking కు ఎప్పుడు
 వెళ్తావు?)
Manohar: Mostly in the morning, now and then in the evening.
గమనించారు కదా? Morning, Evening etc., ముందు 'the' వాడతాంHe goes to school in the morning.He has returns at four in the evening. He has lunch at one in the afternoon. In the night before going to bed, he takes milk.
అయితే ఇదికూడా గమనించండి.
In the night = at night
In the beginning he did not like the school, but as time went on, he liked it more and more. In the end he was sad to leave the school.చూశాం కదా? The beginning, the end, the middle.
Look at the following
 The boy goes to schoolat 9; his father a doctor goes to hospital and his mother, tomarket, about the same time.
            
ఇక్కడ School, hospital, market ముందర a/ an లేదా The లేదు కదా?
ఇవన్నీ కూడా అక్కడ జరిగే పనులను తెలపడానికి ఉపయోగిస్తున్నాం.
a) Students go to school (school ముందు a/an The లేవు).
Parents/ doctors go to hospital. [hospital ముందు The లేదు]
People who want to buy things go to market (market ముందు 'The' లేదు).
a/an లేదా The రాని మరికొన్ని సందర్భాలు                At home (మాట్లాడుతున్న వాళ్ల ఇంట్లో)
               At work - My mother is at work (పనిలో ఉంది)
               I called him by mistake (పొరపాటున)
               By chance I met him (అనుకోకుండా)
               They took part in the game (పాల్గొన్నారు)
Exercise
Supply 'a/an' or 'The' where necessary. Where they need not be used, mark 'x'. 1) There is .... dog in .... room.2) She is .... tallest girl in .... class.3) .... books are kept in libraries.4) What do you like more? .... English movies or telugu movies.5) Where is .... boy that has stolen ... book from the library.6) .... dictionary gives the meanings of .... words.7) .... city is much bigger place than .... village.8) There is ....book shop near our home, and .... shop near to it sells stationary but in
     
both .... shops..... prices are very high.9) .... diamond ring costs more than.... plain ring, but I always prefer.... plain ring, to...
     
diamond ring.10) .... student returns from .... college at five in ... evening.11) ... Srilanka is.... Island to.... south of India.12) We had.... dinner at.... new restaurant last night.13) She is .... second girl to get ... prize.14) These are .... girls who wish to join... school.15) .... Pacific is .... deeper than... Atlantic.16) If Kolakatha and .... Chennai ... former is bigger than ... latter.17) .... Elephants live in .... forests.18) .... cycle is no use in .... rain.19) ... beauty of ... Kashmir attracts a lot of tourists.20) Only.... few attended .... exam held on... Thursday last

Answers
1) a, the
2) the, the
3) X4) X5) the, the
6) The, X
7) A, a
8) a, the, the, the
9) A, a, a, a
10) The, the, the
11) X, an, the
12) X, the
13) the, the
14) The, the
15) the, X, the
16) X, the, the
17) XX
18) A, X
19) The, X
20) a, the, X

LEARN THE ENGLISH GRAMMAR PART V

No 'The' before Abstract Nouns!
Superlative degree అంటే తెలుసుకదా? Greatest, Smallest - ఇలా చివర + est వచ్చే మాటలూ; finest, bravest - ఇలా చివర '+ st' వచ్చే మాటలూ; most beautiful, mostdifficult - ఇలా ముందు most వచ్చేవీ - Superlative degree.
అలాగే చివర ' + er' వచ్చే మాటలు Greater, smaller, taller; చివర '+r' వచ్చే మాటలు Finer, braver; ముందు more వచ్చే మాటలు more beautiful, more difficult - ఇవన్నీ Comparative 
degree.
Look at this sentence:        Krishna is taller than any other boy in the class
- ఈ sentence లో taller, comparative 
degree.
       Comparative degree ముందు, 'the' రాదు; గమనించండి.
ఇక్కడ 'taller' (Comparative degree) తర్వాత than వస్తోంది.
గుర్తుంచుకోండి: Comparative తర్వాత 'than' వస్తే, Comparative ముందు The రాదు.
      ఇప్పుడు ఈ sentence చూడండి. Krishna is taller than Ramana - ఇక్కడ కూడా taller comparative 
degree. దాని తర్వాతే than వస్తోంది. అందుకని Comparative ముందు 'the' వాడం. Comparative తర్వాత than లేకపోతే comparative ముందు 'the' వస్తుంది.
       Krishna is the taller of the two(ఇద్దరిలో కృష్ణ పొడుగు).
      ఇక్కడ taller - comparative degree - దాని తర్వాత than లేదు. అందుకే, taller (comparative) ముందు, the గమనించండి. 
ఇంకొన్ని ఉదాహరణలు చూడండి: a) She is cleverer than any other girl in the group ('cleverer' followed by 'than' - so no 'the' before cleverer).b) She is the cleverer of the two. (ఆ ఇద్దరిలో ఆమె తెలివైంది).
     ఇక్కడ no 'than' after cleverer, so 'the' before cleverer.
Soman: 
Seshu failed the exam. (Seshu పరీక్ష తప్పాడు).
Mohan: (I am) Not surprised at all. He is lazy. The lazy can never pass. (నాకేం ఆశ్చర్యంగా లేదు. వాడు సోమరి. సోమరివాళ్లు ఎప్పుడు pass కాలేరు.)
Soman: No. It all depends on luck. The lucky get what they want, hard work or no 
hard work. (కాదులే. అంతా అదృష్టాన్ని బట్టి
                 ఉంటుంది. అదృష్టవంతులెప్పుడూ వాళ్లకు కావల్సినవి పొందుతారు, కష్టపడినా, పడకపోయినా.)
పై సంభాషణలో, the lazythe lucky అని ఉంది కదా?
ఇక్కడ lazy, lucky, adjectives
(గుణాన్ని, స్థితిని తెలిపే పదాలు, అయితే, అయినటువంటి అనే అర్థాలతో.
lazy = సోమరి అయిన, సోమరితనం ఉన్న, Lucky = అదృష్టవంతులైన/ అదృష్టం ఉన్న).
Adjective ముందు 'the' వాడితే, ఆ గుణం ఉన్నవాళ్లు అనే అర్థం వస్తుంది.
a) The rich and the poor are the same to god.
(rich = ధనం ఉన్న; The rich = ధనవంతులు; Poor = బీద; the poor = బీదవాళ్లు).
b) The hardworking always come up.
(Hardworking = శ్రమించడం; The Hardworking = శ్రమించేవాళ్లు/ కష్టపడి పనిచేసేవాళ్లు.)
     ఒక జాతి మొత్తాన్ని లేదా ఒక తెగకు చెందినదాన్ని తెలపడానికి, 'the' వాడవచ్చు.
a) The dog is a faithful animal = కుక్క (అన్ని కుక్కలూ) విశ్వాసం ఉన్న జంతువు (లు).
b) The lion is courageous = సింహం (అన్ని సింహాలు) ధైర్యం కలది (వి).
Nandan: Gold is becoming costlier and costlier day by day. (బంగారం రోజురోజుకీ ప్రియమైపోతోంది.)
Bhargav: Those who buy it are also increasing. But the worry is even petroleum 
prices are rising. (దాన్ని కొనేవాళ్లు కూడా
                    పెరిగిపోతున్నారు. కానీ ఆందోళన కలిగించేది, పెట్రోలియం ధరలు కూడా పెరుగుతున్నాయి.)

Nandan: With it the prices of iron and steel, of other things like rice and wheat also 
go up, life becomes difficult -
(దాంతో ఇనుము, ఉక్కు ధరలు; బియ్యం, గోధుమలాంటి ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. జీవితం కష్టం అయిపోతుంది.)
Bhargav:  Does gold give you happiness? On the otherhand it makes you sleepless. 
Keeping it safe caused a lot of worry.
                   (బంగారం సంతోషాన్నిస్తుందా? దానికి బదులు అది నిన్ను నిద్రకు దూరం చేస్తుంది. దాన్ని జాగ్రత్తపరచుకోవడం పెద్ద బాధ).
Nandan: The little gold that we can buy need not worry us. (మనం కొనగలిగే చిన్న మొత్తం బంగారం అంతేం బాధ కలిగించదులే.)
ఇది చూడండి:
a) Gold is becoming costlier.
b) Petroleum prices are rising.c) The prices of iron and steel.d) Of other things like rice and wheat.        Gold, Petroleum, Iron, Steel, Rice, Wheat - ఇవన్నీ పదార్థాల పేర్లు కదా. వీటిముందు a/ an/ the లేకపోవడం గమనించండి.
పదార్థాల పేర్లను material nouns అంటారు.
అర్థమయ్యే ఉంటుంది: Material nouns ముందు, 'the' రాదు. 

Cotton
 is grown in India (భారత్‌లో పత్తి పండించబడుతుంది.
మామూలు తెలుగు - పత్తి పండుతుంది)
       Cotton (పత్తి) పదార్థం పేరు బట్టి, ముందు 'The' రాదు.
Coffee is made from coffee powder, milk and sugar, (కాఫీని కాఫీ పొడి, పాలు, పంచదారతో చేస్తారు)

అలాగే మనుషులు, వస్తువుల గుణాల పేర్లు ముందు కూడా, 'The' రాదు. అంటే మనం ఊహించుకోగలిగేవాటి పేర్లు. వీటిని abstract nouns అంటారు.
        Beauty gives us happiness (అందం మనకు ఆనందాన్నిస్తుంది) అందం, ఆనందం - ఇవి ఇలా ఉంటాయని చెప్పలేం కదా? ఇవి abstract nouns. వీటి ముందు 'The' రాదు.
Nisanth: Where do you go at 9 every morning?
Vidaya: 
Dont you know? I am a student. I go to school. (తెలియదా? నేను విద్యార్థిని. స్కూల్‌కు వెళ్తాను.)
Nisanth: This morning just when you started for school my dad, an asthma patient, started for hospital. (ఇవాళ ఉదయం నువ్వు
                   స్కూల్‌కు బయల్దేరిన సమయానికే, ఉబ్బసంతో ఉన్న మా నాన్న ఆస్పత్రికి బయల్దేరాడు).
Udaya: Mom went to temple to do puja too. (మా అమ్మకూడా అదే సమయంలో పూజ కోసం గుడికి వెళ్లింది).
గమనించండి: To school, for hospital, to temple - ఇక్కడ school, hospital, temple ముందు 'The' లేకపోవడం. ఇది ముఖ్యం.
         School, College, hospital, Temple, Church, bed లాంటివాటి ముందు ఈ కింది సందర్భాల్లో 'The' ఉపయోగించం.
a) School/ College (విద్యార్థులు/ ఉపాధ్యాయులు, చదువు సందర్భంలో)
b) Hospital (రోగులు/ వైద్యులు వైద్యం సందర్భంలో)
c) Temple, Church, Masjid (పూజలు, ప్రార్థనలకు వెళ్లినప్పుడు)
d) Bed (విశ్రాంతి/నిద్రకు వాడినప్పుడు). ఎవరన్నా School విద్యార్థి అనడానికి He/ She goes to school.
A: 
What are Your Children? (మీ పిల్లలేం చేస్తారు?)
B: They go to school. (వాళ్లు విద్యార్థులు) 
Look at the following:
¤ No 'The' before the main meals of the day.
(రోజూ చేసే భోజనం ముందు 'The' రాదు).
¤
 I have breakfast at 8 in the morning.
¤
 She invited me to lunch/ dinner/tea tomorrow.
Wife: The teacher beat our son black and blue.
                  
(టీచర్ మన పిల్లాడిని చితక్కొట్టాడు)
                                                       Beat blue and black = చితక్కొట్టడం
Father: What kind of teacher is he? What sort of teaching is his?
                   
(అతడేం టీచర్? అతడిదేం బోధన?)
                                                            sort = kind = విధం
    What/ that/ This kind of/ Type of/ sort of/ manner of ఇలాంటి చోట్ల Kind of/ Type of/ 
sort of/ manner of ముందు లేదా వెనక a/ an/ the రావు.
 Exercise
Fill in the blanks with 'a/an' and 'the' where necessary. If 'a/an' and/the are not necessary mark '0' (Zero).1) __________ cellphone is __________ useful device.device = పరికరం
2) This is __________ book __________ teacher has told us to buy.
3) __________ gold is __________ precious metal, and has been __________ cause 
of many wars. Precious = విలువైన
4) 4) Don't waste __________ time. Go to __________ doctor immediately. Your fever 
has not come down.5) 'Are you new to this place?' ' Yes. This is __________ first time I am out on __________ plane. ____________ sky is blue and __________  whether, pleasant. Pleasant=ఆహ్లాదకరమైన 'Wish you _______ happy flight' (flight = విమానయానం)
6) __________ sun is __________ big globe of __________ burning gasses, 
__________ scientists say.7) __________ Pacific is ___________ deepest Ocean.8) __________ higher you climb, __________ colder you feel. (ఎత్తెక్కినకొద్దీ, చలి ఎక్కువవుతుంది).
9) Last year, __________ earthquake levelled all ___________ buildings in _____ 
area. _________ number of deaths was put at 2000.10. 'Why don't you sing __________song?' '__________ song I can sing is not - _________ modern type.' 'Doesn't (does not) matter. You have _________ sweet voice. It is _________ voice that is important'.11) __________ Ganga is __________ holy river for __________ Hindus.
It is 
among __________ longest rivers of India.12) 'Is Damodar at home?'. 'No. It's (It is) past 9 you see.
He is a student and he starts for __________ school 
at 9. I am going to __________ school to pay __________ fees, and talk to__________ teachers there'.13) Mr. Singh, __________ Director General of Police, is __________ honest officer. He is __________ best officer we have had so far.14) __________ gold is not so useful as __________ steel, though it costs more than __________ steel.15) Gandhi believed that _________ rich should help __________ poor.16) __________ gold found in __________ Tiruvanantapuram temple runs to lakhs of crores of rupees.17) He is __________ poor man. He has __________ family to support.18) __________ Nile, is supposed to be __________ longest river in _________ World.19) Of __________ two boys that came here, __________ older one is __________ son of __________ teacher.20) __________ Mt. Everest is __________ highest peak in __________ Himalayas. Answers:1. A cell phone is a useful device (cell phone, device - both of them are countable singulars. So a before each of them).2. This is the book the teacher has told us to buy. ('The' before book, because if you put the question - which book, you got 111 the answer, the book the teacher has told us to buy; the before teacher because, the speaker and the listener know about it.
ఏ పుస్తకం? teacher చెప్పిన పుస్తకం; అందుకని book ముందు 'The', మాట్లాడేవాళ్లకూ, వినేవాళ్లకూ తెలిసిన teacher కాబట్టి, 'the teacher'
).
3. 0 Gold is a precious metal, and has been the cause of many wars. [Gold, silver, rice 
etc are uncountables, so no a/an/the before it. 'The' before cause - ఎందుకంటే, ఏ కారణం అని ప్రశ్నిస్తే, of many wars అని answer లో వస్తుంది కాబట్టి).
4. Don't waste 0 time. Go to a doctor immediately. The fever has not come down. 
(Time కి కాలం అనే అర్థమైతే 'The' రాదు. సమయం, గంటలు, నిమిషాలతో తెలిపేదైతే, 'the' వస్తుంది.
Doctor - countable singular కాబట్టి, a doctor. Fever గురించి అంతకు ముందే, speaker కు, listner కు తెలుసు కాబట్టి, the fever
).
5. The first time - first, second, third లాంటి వాటి ముందు, the
 ఉండాలి.

¤ The sky- ఒకరకానికి చెందిన వస్తువు ఒక్కటే ఉంటే, దాని ముందు, The వాడతారు. The earth, the sun, 
the moon etc.¤ The whether - ఇక్కడ ఇద్దరికీ (మాట్లాడే, వినే) తెలిసిన విషయం కాబట్టి.
¤ a happy flight - flight, countable, singular
6. The sun (sun ఒక్కటే కాబట్టి); is a big globe ('globe' countable singular) 0burning gasses - ఫలానా gasses
 అని తెలియదు కాబట్టి.
7. Pacific - name of an ocean, so, the Pacific; deepest - superlative degree, so,the 
Pacific.8. Higher, colder - comparative degree తర్వాత than లేదు కాబట్టి, వాటి ముందు, 'The' వస్తుంది. - the higher, ... the colder.9. An earthquake, because, we are talking about one earthquake; thebuildings, because, we are talking of particular
    (ఫలానా) buildings [ఆ చోటులో (area) ఉన్న buildings]; 
the area, because మనకు తెలిసిన area, the number of deaths - 
అక్కడి
    మృతుల సంఖ్య కాబట్టి.
10. 'Why don't you sing a song - a song because, anyone song.¤  The song I can sing - నేను పాడగలిగిన పాట. ఏ పాట? అనే ప్రశ్నకు సమాధానంగా వస్తుంది కాబట్టి. The modern type - ఫలానా రకం
      అంటున్నాం కాబట్టి, the ఉపయోగించాలి.
       
Sweet voice - voice, countable singular. It is the voice that .....,ముఖ్యమైంది ఏదైతే ఉందో ఆ voice కాబట్టి the voice.11. The Ganga, గంగానది పేరు కాబట్టి a holy river - river countable singular కాబట్టి. The longest - longest superlative degree కాబట్టి.
12. Starts for 0 school. Students వెళ్లేది school కే కాబట్టి, school ముందు 'the' రాదు. I am 
going to the school, to pay the fees and talk to
       the teachers there.

¤ నేను ((I) school కు విద్యార్థిగా వెళ్లడం లేదు, (fees కట్టేందుకు వెళ్లే parent) కాబట్టి, theschool. అక్కడ కట్టాల్సిన 'fees' కాబట్టి the fees.
     అక్కడి teachers (ఏ teachers?) కాబట్టి 
the teachers.
13. Mr.Sing, 0 Director General of Police (వ్యక్తి పేరు తర్వాత వాళ్ల హోదా (designation)రాస్తే, దాని ముందు the
 రాదు.)
¤ Officer - countable singular, so an honest officer. 'Best' superlative degree, so 'the
best.14. 0 Gold is not so useful as 0 steel, though it costs more than 0steel.
        
Gold, steel - countable singulars కావు, కాబట్టి, a రాదు. ఏ gold? ఏ steel? అంటే answers లేవు. కాబట్టి the
 రాదు.
15) Gandhi believed that the rich must help the poor. గుణాల పేర్ల ముందు, 'the
' వాడితే, ఆ గుణం కలవాళ్లు అనే అర్థం వస్తుంది.
                                                                                   Good = మంచి, the good = మంచివాళ్లు
         పై sentence లో కూడా rich = డబ్బున్న. The rich = డబ్బున్నవాళ్లు, poor = బీద, the poor 
= బీదవాళ్లు.
16) The gold found in Tiruvananthapuram temple - ఏ gold? అనే ప్రశ్నకు, ఆ గుడిలో దొరికిన gold అని సమాధానం వస్తుంది కాబట్టి, the gold.
18) The Nile (Nile is the name of a river కాబట్టి), is supposed to bethe longest 
(Superlative degree కాబట్టి) river in the world  (world = ప్రపంచం - ఒక్కటే కాబట్టి).
19) Of the two boys that came here ( ఏ ఇద్దరు boys? ఇక్కడికి వచ్చిన boys అని జవాబుంది కాబట్టి) the older (older, comparative degree తర్వాత than లేదు కాబట్టి, ateacher - ఫలానా teacher
 అని చెప్పడం లేదు కాబట్టి).
20) 0 Mt. Everest (Mt. Everest, ఒక పర్వతం పేరు కాబట్టి, దాని ముందు "the" రాదు. Thehighest 
- highest superlative degree)  the Himalayas - Himalayas - ఒక పర్వతం కాకుండా పర్వతపంక్తి (a range of mountains) కాబట్టి.  

LEARN THE ENGLISH GRAMMAR VI

Kundan: Harish was here yesterday. He told me he had taken the exam. It was easy, he said. (హరీష్ నిన్న ఇక్కడ ఉన్నాడు. తను పరీక్ష రాశానని చెప్పాడు. అది సులభంగానే ఉందన్నాడు.)
Mahesh: My sister Kamala took the exam too. She said it was easy too. I am sure they 
will pass. (మా అక్క కమల కూడా రాసింది.ఆమె కూడా చెప్పింది సులభంగా ఉందని. వాళ్లు pass అవుతారని నాకు నమ్మకం ఉంది ).
Kundan: We, I mean you and I, have to wait for our exams for another week. Hope 
they will be easy. 
(మనం, అంటే నువ్వూ నేనూ మన పరీక్షలకు ఓ వారం ఆగాలి. అవి సులభంగా ఉంటాయని ఆశిద్దాం.)
Look at the conversation above. Note the use of the words, I, we, you, he, she, 
they. వీటిని pronouns అంటారు. Nouns కు బదులు వాడే మాటలు pronouns. (Nouns అంటే తెలుసు కదా? మనం దేనికైనా, ఎవరికైనా ఇచ్చే పేరు).
పై సంభాషణలోని Nouns, వాటికి బదులు వాడే Pronouns
 ఇలా ఉన్నాయి కదా:
       Noun                                                     Noun కి బదులు వాడే Pronou1. నా పేరు                                                                   I
2. మా/ మన పేర్లు                                                      We
3. నీ పేరు/ మీ పేర్లు                                                   You4. Harish                                                                  He5. Kamala                                                                She6. Exam                                                                     It7. వాళ్ల, వీళ్ల పేర్లు                                                        They(e.g: Harish & Kamala,                                         They (అవి)
Friends, Parents & Exams)
5. He found it = అతడు దాన్ని చూశాడు
 I gave it some polish (దానికి నేను మెరుగుపెట్టాను) It = అది/ దాన్ని/ దానికి pronoun

6. We defeated them (మేం వాళ్లను ఓడించాం).
 We gave them money (మేం వాళ్లకు డబ్బులు ఇచ్చాం.)
 She threw them away (ఆమె వాటిని విసిరేసింది).
 She painted them (వాటికి రంగు పూసింది) Them = వాళ్లను/ వాళ్లకు/ వాటిని/ వాటికి - 
pronoun
So, II set of pronouns:Me, us, you, him, her, it and them ఇంకా pronouns చూడండి. ఇవి మన విషయాలను తెలియజేస్తాయి.
1) That book is mine (నాది ఆపుస్తకం - Pronoun
).
2) This house is ours (మాది ఈ ఇల్లు - Pronoun
).
3) The toys are yours. (బొమ్మ్లు మీవే)
4) The clothes are his 
(ఆ దుస్తులు అతడివి).
5) The jewels are hers 
(ఆ నగలు ఆమెవి).
6) The elephant is a strong animal. Its trunk is very strong.
 (ఏనుగు బలమైంది.దాని తొండం చాలా బలమైంది).
7) This building is theirs.
 (ఈ మేడ వాళ్లది.)
8) Cars have wheels. These tiers are theirs
. (కార్లకు చక్రాలుంటాయి. ఈ టైర్లువాటివి.                                                            Pronouns
ఇవికాక ప్రశ్నలకు వాడే Pronouns చూద్దాం: వాటిని Interrogative pronouns అంటారు.
a) What is in that box? = ఆ పెట్టెలో ఏం ఉంది? ఏం ఉంది ఆ పెట్టెలో?
b) Which of these books is yours? ఈ పుస్తకాల్లో ఏది నీది?
c) Who is the President of India? భారత అధ్యక్షుడు ఎవరు?
d) Who do you want to meet? ఎవరిని కలవాలనుకుంటున్నావు నువ్వు?
e) Whose is this pen? (ఈ pen ఎవరిది?)
Who (ఎవరు?) Whose (ఎవరిది?) వీటిపక్కన మామూలుగా singular verb వస్తుంది.
Who is...?/ Who has....?/ Who goes...?అయితే Who పక్కన వచ్చే verb, దాని తర్వాత వచ్చే సంఖ్యను బట్టి plural అవుతుంది.
Who are they? Who are going there?
ఇలాగే what తర్వాత కూడా మామూలుగా singular verb వస్తుంది.
అయితే subject plural అయితే verb కూడా plural అవుతుంది. Who ishe? (he - singular verb, because 'he' is singular.)
Who are these boys? (Boys plural కాబట్టి, who are ...?)

LEARN THE ENGLISH GRAMMAR PART VII


1) What? (ఏం? ఏది?);
2) Which?
 (ఏది?/ ఎవరు? - (కొన్నింటిలో/ కొందరిలో);
3) Who?
 (ఎవరు?);
4) Whose?
 (ఎవరిది?)
5) Whom ?
 (ఎవరిని?/ ఎవరికి?)
.... ఇవన్నీ

Interrogative pronouns.      (ముఖ్యమైన విషయం- Modern English Usageలో Whom వాడుకలో లేదు. దాని బదులు 'who' వాడుతున్నారు.)
      Interrogate అంటే ప్రశ్నించడం. ఇవన్నీ ప్రశ్నించేందుకు వాడే pronouns కాబట్టి వాటిని Interrogative pronouns అంటారు.
      (కిందటి పాఠాల్లో తెలుసుకున్నదేమిటంటే.. subjectను బట్టి, who/ what తర్వాత singular verb లేదా plural verb రావచ్చు.)

Nishanth: The scenery is beautiful, isn't it? (ఈ దృశ్యం అందంగా ఉంది కదా?)
Angeeras: Very charming, really. It is hot down below, but on top of this hill, it is cool and comfortable.
                    (నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. కింద వేడిగా ఉంది, కానీ ఈ కొండమీద మాత్రం చల్లగా, సుఖంగా ఉంది.)
Nishanth: The weather in high places is always cool.
                   (ఎత్తయిన ప్రదేశాల్లో వాతావరణం ఎల్లప్పుడూ చల్లగానే ఉంటుంది.)

    
Angeeras: That's why rich people go to hill stations during summer.
                    (అందుకనే బాగా డబ్బున్న వాళ్లందరూ వేసవిలో కొండ ప్రాంతాలకు వెళుతుంటారు.) Nishanth: Last summer I was fortunate enough to go to Ooty. Dad in his busy time, took a fortnight off to take us there.
                  What a lovely place indeed!
                   (కిందటి వేసవిలో ఊటీకి వెళ్లే అదృష్టం నాకు దక్కింది. నాన్న ఓ పదిహేనురోజులు తీరిక చేసుకుని మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్లారు.
                    ఊటీ ఎంత అందంగా ఉందో?)
Angeeras: What's in the big bag you are carrying? Isn't it heavy? Why don't you put it on the floor and carry it when you leave?
                   (ఏంటా పెద్ద సంచి నువ్వు మోస్తున్నది? అది బరువుగా లేదా? దాన్ని నేలమీద ఉంచి, వెళ్లేటప్పుడు తీసుకు వెళ్లొచ్చుకదా?) Nishanth: It has some important papers in it. I am afraid might forget the bag if I leave it on the floor.                  (ఆ బ్యాగ్‌లో ముఖ్యమైన పేపర్లు ఉన్నాయి. కింద ఉంచితే దాన్ని మర్చిపోతానేమోనని భయం.)
Angeeras: Don't worry; you are strong enough to carry it.
                   (నువ్వేం బాధపడకు. దాన్ని మోసేందుకు తగినంత బలం ఉన్నవాడివే?)
Nishanth: You are tall but lean. I doubt if you can carry this as easily as I do.
                  (నువ్వు పొడుగే కానీ సన్నం. నేను మోస్తున్నంత సులభంగా నువ్వు దీన్ని మోయగలవా అని నా అనుమానం.)
Angeeras: OK. I must be going bye. (సరే. నేను వెళ్లాలి వస్తా.) 
                                        Look at the following expressions from the conversation above.
        1) The weather in high places is cool.        2) That's why rich people go to hill stations during summer.        3) Last summer I was fortunate enough to go to Ooty.        4) Dad in his busy time took a fortnight off.        5) What a lovely place indeed!        6) What is the big bag you are carrying?        7) Isn't it heavy?        8) It has some important papers in it.        9) I am afraid .....        10) You are strong enough to carry it.        11) You are tall, but lean.     పైన underline చేసిన మాటలను చూడండి. అవన్నీ కూడా ఒక వస్తువు/ ఒకరి గుణాలు, లక్షణాలను తెలిపే మాటలే కదా? చూద్దాం!
        1) High places = ఎత్తయిన ప్రదేశాలు.
            ఇక్కడ high (ఎత్తయిన) అనేది places (ప్రదేశాల) లక్షణాన్ని/ గుణాన్ని తెలుపుతుంది.
       2) అలాగే, The weather in high places (ఎత్తయిన ప్రదేశాల్లో), is cool (చల్లగా).
            ఇక్కడ కూడా cool (చల్లగా) అనేమాట, weather (వాతావరణం) లక్షణాన్ని/ గుణాన్ని తెలుపుతుంది.
            ఇలా వస్తువులు/ ప్రదేశాలు/ వ్యక్తుల లాంటి వాటి లక్షణాలను తెలిపే మాటలు ADJECTIVES.
     
 పై సంభాషణ నుంచే మరికొన్ని Adjectives చూద్దాం:
     3) rich = డబ్బున్న/ సంపన్నులైన
     4) fortunate = అదృష్టం ఉన్న/కలిగిన
      Fortunate to be here = ఇక్కడ ఉండే అదృష్టం.
     5) busy = తీరిక లేని.
     6) lovely = అందమైన/ సుందరమైన.
 
        7) big = పెద్దదైన
        8) heavy = బరువైన
        9) important = ముఖ్యమైన
        10) afraid = భయంగల/ భయపడుతున్న.
        11) tall = పొడుగైన/ ఎత్తయిన
        12) lean = సన్నని/ బక్కపలచని
      పైవన్నీ Adjectives. Adjectives కు తెలుగులో అయినా/ అయినటువంటి (tall = పొడుగైన/ పొడుగైనటువంటి); ఉన్న/ ఉన్నటువంటి (Hot = వేడిగా ఉన్న/ ఉన్నటువంటి), గల/ గలిగినటువంటి (Rich = డబ్బుగల/ గలిగినటువంటి) అనే అర్థాలు వస్తాయి.
        Adjectives ఎప్పుడూ nounను గురించే చెబుతాయి/ వర్ణిస్తాయి.
       High places - 'High' - adjective, 'places' అనే nounను గురించి చెబుతోంది/ వర్ణిస్తోంది. అలాగే rich people లో rich - adjective, people అనే nounను గురించి చెబుతోంది.
       Noun ఎలాంటిదో తెలియజేసేవన్నీ కూడా Adjectives. చాలాసార్లు మనం '-ing' forms (Walking, singing లాంటివి) కూడా noun ఎలాంటిదో తెలియజేసేందుకు వాడతాం కదా. అప్పుడు అవికూడా adjectives అవుతాయి.
e.g.: a) A walking stick (stick అనే nounను గురించి చెబుతుంది కాబట్టి, walking కూడా 
adjective).        b) Waiting passengers = వేచి ఉన్న ప్రయాణికులు.
       - ఇక్కడ passengers అనే nounను గురించి చెబుతోంది కాబట్టి 
'waiting' adjective.
c) The sinking ship = మునిగిపోతున్న ఓడ
       
Ship అనే nounను వర్ణిస్తోంది కాబట్టి sinking (-ing form) - adjectived) Running train - కదులుతున్న రైలు - Running (-ing form) - adjective, train - noun.
        '_ing' formను adjective గా వాడినట్లే, past participles ను కూడా adjectives గా వాడతారు. (past participles అంటే తెలుసుకదా- sing అనే verb కు, sung; give అనే verbకు given; go అనే దానికిgone - ఇవి past participles - ఎక్కువగా V3 అని లేదా PP అని అంటుంటారు). Past participles (PP) ని కూడా, '_ing' form లాగే, noun ఎలాంటిదో తెలిపేందుకు వాడతాం. కాబట్టి, 
Past 
participles కూడా adjectives.
        
చాలా verbsకు past participles -ed, -d, -t చేర్చి PP ని form చేస్తాం:        talk - PP - talked; love - PP - loved; smell - PP - smelt).       PP adjectives గా ఇలా వాడతాం.
  
a) Cooked food (వండిన ఆహారం) - Cooked (PP), food ఎలాంటిదో చెబుతుంది కాబట్టి
cooked (PP), adjective.
b) Torn clothes (చినిగిన బట్టలు) - Torn (చినిగిన) PP, clothes ఎలాంటివో చెబుతుంది కాబట్టి, 'torn' - adjective.c) Damaged car: Damaged (PP), adjective, qualifying the noun car.d) A painted wall - painted (PP)- adjective and wall noun.     Adjectives ను రెండు విధాలుగా వాడతారు:
1) Noun ముందు వాడతారు:
    The beautiful building is my uncle's. (అందమైన ఆ మేడ మా బాబాయిది.)
     ఇక్కడ adjective 'beautiful'ను, noun, building
 ముందు వాడుతున్నాం.
2) Adjectives ను sentence చివర కూడా వాడవచ్చు.
     The building is beautiful - 'beautiful' noun తర్వాత sentence చివరే ఉంది కదా:
         Noun ముందు వాడలేని adjectives కూడా ఉన్నాయి. ఒక ఉదాహరణ: Afraid. An afraid child అని child (noun) ముందు adjective afraid ను వాడం. ఇలాంటివి మరికొన్ని తర్వాత చూద్దాం. సాధారణంగా ఈ కింది శబ్దాలతో అంతమయ్యే English మాటలన్నీ దాదాపు (అన్నీ కాకపోవచ్చు) Adjectives (ఇలా మాటల చివర చేర్చి ఆ మాటల parts of speech ని మార్చగల శబ్దాలను
suffixes 
(singular, suffix) 
అంటాం:)         1. _al : Accidental, medical, personal.....        2. _ful: Beautiful, wonderful, successful        3. _ic: Historic, Photographic, basic        4. _ical: Historical, magical, practical        5. _ish: foolish, childish, selfish        6. _less: senseless, useless, homeless        7. _ly: friendly, costly, daily        8. _ous: poisonous, dangerous, zealous        9. _y: cloudy, rainy, funny        10. _able: Notable, eatable, laughable        11. _ible: forcible, flexible, sensible        12. _en: frozen, darken, shorten                         ఇవేకాక, ఇంకొన్ని Adjective prefixes కూడా ఉన్నాయి. వాటిని తర్వాత తెలుసుకుందాం.

Adjectives అంటే గుణాలు/ లక్షణాలను తెలిపే పదాలు. మనం ఎప్పుడైనా ఎవరిదైనా/ దేనిదైనా లక్షణాలను గురించి మాట్లాడినప్పుడు పోల్చి చూడటం సహజం. ఒకరికంటే, ఇంకొకరు ఏదైనా లక్షణంలో ఎక్కువ/తక్కువ అనో, ఒకదానికంటే ఇంకొకటి మించిందనో తక్కువ అనో అంటుంటాం కదా? అందుకు adjectives నే వాడతాం కదా? ఇలాంటి తరతమ భేదాలను తెలిపేందుకు Degrees of comparison వాడతాం.
Comparison - పోల్చడం; Degree - పోల్చేటప్పుడు ఏ మేర (Degree)కి ఏది ఎంత ఎక్కువ, తక్కువ అని తెలపడం.)
 The elephant is a big animal. ఈ sentence లో 'animal' ను వర్ణించేది big, adjective. ఈ వాక్యంలో మనం ఏనుగును దేనితోనూ పోల్చడం లేదు.
              The elephant is bigger than the lion:
         (ఏనుగు సింహం కంటే పెద్దది) - ఇక్కడ ఏనుగును సింహంతో పోలుస్తున్నాం. అంటే ఇక్కడ Comparison ఉంది.
       The elephant is the biggest of all the animals - ఏనుగు భూమిమీద తిరిగే జంతువులన్నింటిలో పెద్దది. ఇక్కడ కూడా ఏనుగును మిగతా జంతువులన్నింటితో పోలుస్తున్నాం.
  
        ఇలాP big, bigger, biggest అనే మాటలను పోల్చేందుకు కొద్దిగా మార్పు చేస్తాం,  దీన్నే
Degrees 
of comparison of adjectives అంటాం. positive Degreeమూడు Degrees, మనకు తెలుసు:
  Positive Degree
a) ఒకతెగకు చెందిన వాటిలో (మనుషులు/జంతువులు) మరే ఇతర జీవి దీనంత కాదు అంటాం.
e.g.: No other animal is as big as the elephant.
 (ఏ ఇతర జంతువూ ఏనుగంత పెద్దది కాదు.) (రెండింటికంటే ఎక్కువ విషయాల పోలిక)
               b) ఒక్కోసారి, రెండింటినీ/ ఇద్దరినీ పోల్చి చెబుతాం: మరోజంతువు/ వ్యక్తి దీనంత (మనం మాట్లాడుతున్నంత) పెద్దదికాదు.
     The lion is not so/ as big as the elephant (సింహం ఏనుగంత పెద్దది కాదు - పోలిక రెండింటి మధ్యే- 'ఒకటి ఇంకొకదాన్నంత పెద్దది కాదు అని.) 

Comparative 
             a) రెండింటిని మాత్రమే పోల్చినప్పుడు:
                 The elephant is bigger than the lion
                 
(సింహం కంటే ఏనుగు పెద్దది.)
  
            b) రెండింటి కంటే ఎక్కువ వాటిని పోలిస్తే.
                 The elephant is bigger than any other animal/ all other animals.
                 (ఏనుగు ఏ ఇతర జంతువు కంటే/ అన్ని ఇతర జంతువుల కంటే పెద్దది.
Superlative            రెండింటిని మాత్రమే పోల్చినప్పుడు, Superlative degree ఉండదు. రెండింటికంటే ఎక్కువ విషయాలు పోల్చినప్పుడే Superlative ఉంటుంది.
The elephant is the biggest animal/ the biggest of all animals/ the biggest animal of all.

No comments:

Post a Comment